Carrot Health Benefits: క్యారట్ ఆరోగ్య ప్రయోజనాలు, దుష్ప్రయోజనాలు

Carrot Health Benefits: క్యారట్ లో మంచి ఆరోగ్య పోషకాలు ఉంటాయని మనందరికీ తెలుసు. క్యారట్ తింటే కళ్లకి మంచిదని, క్యారట్ లో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు దోహదపడుతుందని అంటారు. క్యారట్ కొనడానికి కూడా చాలా తక్కువ రేటుతో అందుబాటులో ఉంటుంది. పిల్లలు క్యారట్ ను ఇష్టంగా తింటారు. క్యారట్ ను కడుక్కొని నేరుగా తింటే కూడా ఆరోత్యానికి చాలా మంచిది. క్యారట్ కు సంబంధించిన మరిన్న విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

uses side effects caused by carrots
Source: www.nzraty.com

దేశంలో అన్ని రాష్ట్రాల్లో కంటే కర్నాటక, బిహార్ లో క్యారెట్ అధికంగా పండుతుంది. ప్రపంచంలోని క్యారెట్ ఎగుమతుల్లో 90 శాతం చైనా నుంచి ఎగుమతి అవుతాయి. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా క్యారెట్ బాగా పండుతుంది.

క్యారెట్ ఆరోగ్య ప్రయోజనాలు

  • క్యారెట్ శరీరంలోని కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది, గుండె జబ్బులను కూడా రాకుండా నివారిస్తుంది
  • క్యారెట్ లో ఉండే విటమిన్ ఏ చర్మాన్ని ఎండ నుంచి కాపాడుతుంది. చర్మం ముడతలు పడకుండా, పొడిగా మారకుండా చేస్తుంది.
  • క్యారెట్ ను రెగులర్ డైట్ లో భాగంగా చేసుకుంటే కావలసినంత ఫైబర్ బాడీకి అందుతుంది, ఇందులో ఉండే కెరోటిన్ కంటెంట్ దృష్టిని మెరుగుపరుస్తుంది.
  • క్యారెట్ లో ఉండే సోడియం, రక్తపోటును నియంత్రిస్తుంది. క్యారెట్ ను రెగులర్ గా తినడ వల్ల బాడీలో బీపీ కూడా కంట్రోల్ లో వుంటుంది.
  • క్యారట్ జ్యూస్ రోజూ తాగితే, బాడీలో కొవ్వు కరిగిపోతుంది. నోటిలో హానికరమైన బ్యాక్టీరియా ఉంటే కూడా నివారించబడుతుంది.

క్యారెట్ దుష్ప్రభావాలు

  • క్యారెట్ ఎక్కువగా తింటే జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపెడుతుంది
  • చిన్న పిల్లలు క్యారెట్లు ఎక్కువగా తినడం మంచిది కాదు
  • ఎక్కువ క్యారెట్లను తింటే శ్వాస కోశ సమస్య రావచ్చు
  • మధుమేహం ఉన్న వారు క్యారెట్లను ఎక్కువగా తినకూడదు
  • గర్భిణులు ఎక్కువగా క్యారెట్ జ్యూస్ ను తీసుకుంటే, బిడ్డకు ఇచ్చే పాల రుచి మారిపోతుంది
  • క్యారెట్ లో బీటా కెరోటీన్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. క్యారెట్లు ఎక్కువగా తింటే, రక్తంలోకి ఎక్కువ కెరోటిన్ వెళ్లి కెరోటెయిమియా బారిన పడే అవకాశం ఉంది.
  • క్యారెట్లను అధికంగా తీసుకుంటే, స్కిన్ అలెర్జీలు, డైయేరియా, అనఫైలాక్టిక్ రియాక్షన్లు, వాపు లాంటి సమస్యలు ఎదురవుతాయి.

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు