Garlic Benefits: వెల్లుల్లి ఆరోగ్య ప్రయోజనాలు, దుష్ప్రభావాలు

Garlic Benefits: వెళ్లుల్లి లేనిదే ఏ కూర పూర్తి కాదు. వంటలో ఖచ్చితంగా వెల్లుల్లి ఉండాల్సిందే. వెల్లుల్లిని తెల్లగడ్డ, ఎల్లిగడ్డ, ఎల్లి పాయ అని కూడా అంటారు. దీనికి ఆయుర్వదంలో కూడా ప్రముఖమైన స్థానం ఉంది. వెల్లుల్లితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వెల్లులికి వంటకంలో వేల ఏళ్ల చరిత్ర ఉంది. సుమారు 2100 బీసీ నుంచే సుమేరియన్లు వెల్లుల్లిని ఆహారంగా ఉపయోగిస్తున్నారు. పురాతన గ్రీస్ లో ఒలంపిక్ ఆటలో మరించ చురుగ్గా ఆడడానికి వెల్లుల్లిని తినేవారంటారు. వెల్లుల్లి గురించిన మరిన్న విషయాలని ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

benefits-of-garlic-uses-and-side-effects
Source: www.publicdomainpictures.net

వెల్లుల్లి ఆరోగ్య ప్రయోజనాలు

  • వెల్లుల్లి కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి, దీంతో గుండె సంబంధిత వ్యాధుల నుంచి బయట పడతారు
  • వెల్లుల్లి యాంటీ బయోటిక్ గా కూడా పనిచేస్తుంది. మధుమేహం ఉన్న వ్యక్తులలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేస్తుంది
  • వెల్లుల్లి బరువు తగ్గడంలో బాగా దోహదం చేస్తుందని అధ్యయనంలో తేలింది. 24 గంటల్లో వెల్లుల్లి తీసుకున్న వారి బరువు తగ్గుతుందని అనేక సార్లు రుజువైంది.
  • వెల్లుల్లి చర్మ పునరుత్పత్తిని బాగా పెంచుతుంది. చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చి, మొటిమలు, సోరియాసిస్, తామర లాంటివి రాకుండా నిరోధిస్తుంది.
  • వెల్లుల్లి ఒక అద్భుతమైన యాంటీమైక్రోబియల్, నోటి మైక్రోఫ్లోరాను కంట్రోల్ చేస్తుంది. దంతాలు పుచ్చిపోకుండా ఆరోగ్యంగా ఉంచుతుంది.
  • వెల్లుల్లి వాపును నివారిస్తుంది, క్యాన్సర్ పెరుగుదలను కూడా నిరోధిస్తుంది.
  • వెల్లుల్లి మహిళల్లో ఒత్తిడిని తగ్గిస్తుంది, ఆక్సిజన్ స్తాయిలను పెంచుతుంది.
  • జుట్టుకు వెల్లుల్లి చాలా మంచది. వెల్లుల్లిని తలపైన అంటుకుంటే బట్టతల పై వచ్చే మచ్చలు తగ్గుతాయి. జుట్టు బలంగా మారి ఒత్తుగా పెరుగుతుంది. తలపై జుట్టులో ఉన్న సూక్ష్మ క్రిములను కూడా చంపే శక్తి వెల్లుల్లికి ఉందని పరిశోధనల్లో తేలింది.
  • ఆయుర్వేదం ప్రకారం వెల్లుల్లి శరీరంలో వేడిని పెంచుతుంది. జలుబు దగ్గు ఉన్నవారు వెల్లుల్లిని తీసుకుంటే మంచి ప్రయోజనం, ఉపశమనం ఉంటుుంది.

వెల్లుల్లి దుష్ప్రభావాలు

  • వెల్లుల్లి రక్తాన్ని పలచబరుస్తుంది. రక్తాన్ని పలచబరిచే మందుల కన్నా నేరుగా వెల్లుల్లిని తీసుకుంటే మంచిది
  • వెల్లుల్లిని దీర్ఘకాలంపాటు చర్మం పై రాసుకుంటే మంట, దురద లాంటివి పెరిగే అవకాశం ఉంది
  • వెల్లుల్లి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. మీరు మధుమేహంతో బాధ పడుతుంటే వెల్లుల్లి తీసుకోవడం మంచిదే, కానీ ముందుగా డాక్టర్ ను సంప్రదించండి
  • గర్భిణులు వెల్లుల్లి తినకపోవడం మంచిది. తినవలసి వస్తే కేవలం తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి. వెల్లుల్లి తినే ముందు డాక్టర్ ను తప్పకుండా సంప్రదించాలి.

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు