Benefits Of Coriander: ధనియాలు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Benefits of Coriander: ధనియాలను మనము ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తాము. దీనికి కొత్తిమీర అని కూడా అంటారు. ధన్యాలు ఎక్కువగా మధ్యధరా దేశాలలో కనిపిస్తాయి. వీటిని ఆంగ్లంలో కొరియండర్ అని లాటిన్ లో కొరింటం సాటివం అని కూడా అంటారు. ధనియాలను మనము ఎక్కువగా సాంబర్ లో ఉపయోగిస్తాము. అయితే ధనియాలు మనకు ఇంకా ఎలా ఉపయోగపడుతుంది, ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి లాంటి విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం

benefits-of-coriander

ధనియాలను మనము ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తాము. ధనియాలను ఔషధంగా ఉపయోగిస్తారు. కొత్తిమీర మొక్కే కి పండిన ఫలంలోని విత్తనాలే ధనియాలు. కొత్తిమీర మొక్క 30 సెంటిమీటర్ల వరకు పెరుగుతుుంది. కొత్తిమీర ఆకుకి జ్వరం తగ్గించే గుణం, కడుపులో మంటను తగ్గించే లక్షణం కలిగి ఉంటుంది.

ఆయుర్వేద చికిత్సలో ధనియాలు

జ్వరం తగ్గడానికి

కొత్తిమీర అల్లం కలిపి తీసుకుంటే జ్వరం తగ్గి ఆకలి పెరుగుతుంది. కడుపులో ఏదైనా మంట ఉంటే కూడా తగ్గిపోతుంది. జ్వరం మరీ తీవ్రంగా ఉంటే కొత్తిమీర రసం, అల్లం, నిమ్మరసం చెక్కర వేసి ఓ గ్లాసు జ్యూస్ లా తయారు చేసుకోవాలి. అది తాగితే ఎంతటి జ్వరమైనా తగ్గిపోతుంది. తగ్గకపోతే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి

ఆర్శమొలలు తగ్గిస్తుంది

ధనియా మొక్కను శొంటిని కలిపి నీళ్లలో ఉడకబెట్టాలి. ఆ రసాన్ని తాగితే ఆర్శమెలలు తగ్గిపోతాయి. కడుపులో ఏదైనా గ్యాస్ ఉంటే కూడా బయటికి వెళ్లిపోతుంది.

కీళ్ల నొప్పుల నివారిణి

ఆర్థరైటిస్ ఉన్న వారు ఈ మిశ్రమాన్ని తాగితే మంచి ఫలితం ఉంటుంది. 10 గ్రాముల ధనియాలు, 20 గ్రాముల జీలకర్ర, బెల్లం బాగా కలిపి మరిగించాలి. దీన్ని తాగితే కీళ్ల నొప్పులు, వాపులు తగ్గిపోతాయి.

పిల్లల్లో దగ్గు, ఆయాసం

బియ్యం నీటిలో దాల్చిన చెక్క కలిపి అందులో కొంత ధనియాల పొడి వేసి పిల్లలకు ఇస్తే దగ్గు అలసట రెండు తగ్గిపోతాయి. కడుపునొప్పిని తగ్గాలంటే ధనియాలు, పచ్చిమిర్చి, కొబ్బరి తురుము, అల్లం, నల్ల ఎండుద్రాక్ష కలిపి తినాలి.

కంటి సమస్యలు

20 గ్రాముల ధనియాల పొడిని ఓ గ్లాసు నీటిలో ఉడికించిన తరువాత వడ కట్టాలి. రసం చల్లారిన తరువాత ఒక్కో కంటిలో రెండు చుక్కల ఈ రసాన్ని వేయాలి. కంటి కళక, కంటి దురదలు, కళ్ల మంటలు, కళ్ల నుంచి నీరు కారడం లాంటి సమస్యలు ఏవైనా ఉంటే తొలగి పోతాయి.

తల నొప్పి గొంతు నెప్పి తగ్గడానికి

రోజూ ఉదయం సాయంత్రం 5 నుంచి 10 ధనియా గింజలను నమిలితే గొంతు నొప్పితగ్గిపోతుంది. ఎండవేడి వల్ల తలనొప్పి వస్తే రాత్రంతా నాన బెట్టిన ధనియా, ఉసిరికాయలను ఉదయం మెత్తగా రుబ్బుకొని పేస్టులా చేసుకోవాలి. దాన్ని నీళ్లల్లో, కొంత చక్కెర వేసుకొని కలిపి తాగితే తల నొప్పి నుంచి ఉపశమనం దక్కుతుంది.

కొలెస్ట్రాల్ కంట్రలోల్

కొలెస్ట్రాల్ కంట్రలోల్ లో ఉండాలంటే 2 చెంచాల ధనియాల పొడిని ఒక గ్లాసు నీళ్లలో మరిగించి చల్లారిన తరువాత వడపోసుకొని తాగాలి. ఇలా ప్రతీ రోజు 2 పూటలు చేస్తే 2 నెలల్లో మంచి ఫలితాన్ని మీరే చేస్తారు.

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు