Gurivinda Ginjalu: గురివింద గింజల వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. గురివింద గింజను మనము సామెతల్లో ఎక్కువగా ఉపయోగిస్తాం. గురువింద్ గింజ ఎక్కువ అనే సామెత అందరికీ తెలిసిందే. గురివింద గింజలు ఎక్కువగా మనకు ఊళ్లల్లో కనిపిస్తాయి. చిన్న రేగుపండులా గుచ్చుగా ఉండి చెట్ల కొమ్మల మధ్యలో ఇవి ఉంటాయి. గురువింద గింజలు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నలుపు రంగుల్లో ఉంటాయి. మనకు ఎక్కువగా ఎరుపురంగు గురివింద గింజలే కనిపిస్తాయి.

గురివింద గింజల్లో విషపదార్ధం ఉంటుంది. వీటిని మరిగించి లేదా గింజ పై పొట్టును తీసి మాత్రమే ఈ గింజలను తీసుకోవాలి ఉపయోగించాలి. ఆయుర్వేదంలో ఈ గురివింద గింజకు ప్రముఖ స్థానమే ఉంది. గురువింద గింజల గురించి మరిన్ని విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాము.
గురివింద గింజ ఆరోగ్యప్రయోజనాలు
- పేనుకొరుకుడుకు సమస్యకి ఈ గురివింద గింజ బాగా పనిచేస్తుంది. గురివింద గింజ పొట్టు తీసి, ఆ గింజలో నువ్వుల నూనె కలిపి పేనుకొరుకుడు ఉన్న ప్లేస్ లో అప్లై చేస్తే వెంటనే అక్కడ జుట్టు పెరుగుతుంది
- గురివింద ఆకులను మెత్తగా నూరి నువ్వల నూనెలో పోసుకొని మరిగించాలి. నూనె మాత్రమే మిగిలేలా దీన్ని మరిగించాలి. చల్లారిన తర్వాత దాన్ని ఓ సీసాలో నిల్వ చేసుకోవాలి. ఆ నూనెను తలకు రోజు అంటుకుంటే జుట్టు బలంగా, ఒత్తుగా పెరుగుతుంది.
- గురివింద ఆకుల రసాన్ని రెండు చుక్కలు చెవిలో పోసుకుంటే చెవిపోటు తగ్గిపోతుంది.
- గురివంద ఆకులను బాగా నూరి, ఆ పొడి సమానంగా చక్కెర వేసి కలుపుకొని తాగితే దగ్గ త్వరగా తగ్గిపోతుంది.
- చలికాలంలో కొందరు బొంగురు గొంతులో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు గురివింద ఆకులను నమిలితే బొంగురు గొంతు సమస్య తగ్గిపోతుంది.
- వాపులు తగ్గడానికి.. గురివింద ఆకులకు ఆముదం రాసి వేడి చేసి ఆ ఆకులను వాపు ఉన్నచోట బట్టతో కడితే వాపు తగ్గిపోతుంది.
- చర్మం పై తెల్ల మచ్చలుంటే.. గురివింద ఆకుల రసాన్ని మచ్చలపై వేసుకోవాలి. ఆ తరువాత ఎండలో ఓ 20 నిమిషాలు అలాగే నిలబడితే ఆకుల రసం, ఎండ ప్రభావంతో తెల్లమచ్చలు పోతాయి, కానీ కొన్ని రోజులు ఇలాగే చేస్తేనే మంచి ఫలితం ఉంటుంది.
- గురివింద గింజలను కాల్చి ఇంట్లో పొగ వేస్తే దోమలు పోతాయి. వారంలో 2 రోజులు ఈ గురువింద గింజ పొగవేస్తే దోమలు గుడ్లు కూడా పెట్టకుండా ఉంటాయి.
ఇవి కూడా చూడండి
- Side Effects Of Aloevera: అలోవెరాతో కలిగే దుష్ప్రయోజనాలు
- Benefits Of Coriander: ధనియాలు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
- Garlic Benefits: వెల్లుల్లి ఆరోగ్య ప్రయోజనాలు, దుష్ప్రభావాలు
- Carrot Health Benefits: క్యారట్ ఆరోగ్య ప్రయోజనాలు, దుష్ప్రయోజనాలు