Sabudana Health Benefits: ఆయుర్వేదంలో సగ్గుబియ్యానికి ప్రముఖమైన స్థానం ఉంది. సగ్గుబియ్యాన్ని సాబుదానా అని కూడా అంటారు. వంటింట్లో ఈ సాబుదానని చూసే ఉంటారు. తెల్లగా చిన్న చిన్న గోలీల్లా ఇవి ఉంటాయి. మీరనుకుంటున్నట్లు సాబుదానా చెట్టకి కాయదు. ఇది కర్రపెండలం అనే దుంపలను నుంచి వస్తుంది. ఆ దుంపల నుంచి తీసిన గంజి నుంచి దీనికి ఇలా తయారు చేస్తారు. సాబుదానా గురించి మరిన్ని విషయాలను మనము ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
సాబుదానా ఎలా పెరుగుతుంది?
- సగ్గుబియ్యం నేరుగా చెట్లకు వడ్డు పెరిగినట్లు పెరగదు. ఇది కర్రపెండలం మొక్క నుంచి వస్తుంది. ఈ కర్రపెండలం మొక్క ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా పెరుగుతుంది. కర్రపెండలం మొక్క 20 అడుగుల వరకు పెరుగుతుంది. వీటి దుంపల నుంచి తీసని స్టార్చ్ (గంజి)తోనే ఈ సగ్గుబియ్యాన్ని తయారు చేస్తారు. భారత దేశంలో ఈ మెక్కను తమిళనాడు, కేరళలో బాగా పండిస్తారు.
- సగ్గుబియ్యం ఆరోగ్య ప్రయోజనాలు
- సగ్గుబియ్యంలో కాలరీలు, ఫైబర్ మాత్రమే ఉంటుంది, కొవ్వు పదార్ధాలు ఉండవు. కాబట్టి బరువు తగ్గడంలో సాబుదాన చాలా దోహదపడుతుంది.
- మధుమేహంతో బాధపడుతున్న వారికి ఈ సగ్గుబియ్యం చాలా మేలు చేస్తాయి. పరిశోధనల్లో.. ఈ సగ్గుబియ్యం బాడీలో ఇన్సులిన్ స్థాయిని పెంచుతుందని కనుగ్గొన్నారు. సాబుదాన రక్తంలో చక్కెర స్థాయిని కూడా తగ్గిస్తుందని కూడా బయటపడింది. కాబట్టి డయాబెటిక్ పేశంట్లకు సాబుదాన మంచిది.
- సాబుదానకు 50 శాతం జీర్ణక్రియ అవసరం లేకుండానే ఇవి బాడీలో జీర్ణం అయిపోతాయి. గనుక ఈ సగ్గుబియ్యం పిల్లలకు చాలా మంచిది. ఇందులో క్యాలరీలు, ఫైబర్ మాత్రమే ఉంటుంది. ప్రొటీన్లు కూడా తక్కువ ఉండడం చేత ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు.
- 100 గ్రాముల సగ్గుబియ్యంలో 20 మిల్లీగ్రామలు కాల్షియం ఉన్నట్లు కనుగ్గొన్నారు. సాబుదానని రోజూ కొంత తీసుకుంటే బాడీకి అవసరమైన కాల్షియం అందుతుంది.
సగ్గు బియ్యంతో కలిగే దుష్ప్రభావాలు
- సగ్గుబియ్యంలో కేలరీలు ఉన్నప్పటికి విటమిన్లు, కొవ్వు లాంటి ఇతర ఖనిజాలు ఎక్కువగా లేవు కాబట్టి సాబుదాన పూర్తి ఆరోగ్యకరమైన ఆహారం కాదు
- సాబుదాన మొక్క అదే.. కర్రపెండలంలో టాక్సిన్స్ ఉంటాయి. ఇవి దీర్ఘకాలికంలో బాడీలో ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. కాబట్టి మార్కెట్లో బ్రాండెడ్ సాబుదానని కొనడమే మంచిది. తక్కవ రేటు ఉన్న సాబుదానని కొంటే దాన్ని సరిగా ఫిల్టర్ చేసి ఉండరు.
- సాబుదానలో కార్బొహైడ్రేట్స్ ఉంటాయి. అవి తరువాత బాడీలో చక్కెర పెరగడానికి కారణం అవుతాయి కాబట్టి మధుమేహం ఉన్నవారు డాక్టర్ ను సంప్రదించిన తరువాతే సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి
- లెటెక్స్ ఎలర్జీ ఉన్నవారు సాబుదాన తీసుకుంటే వ్యతిరేక ఫలితాలు వస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది. గనుక మీకు ఏరకమైన ఎలర్జీలు ఉన్నా.. సగ్గుబియ్యాన్ని ఆహారంగా తీసుకోవద్దు.
ఇవి కూడా చూడండి