Fish Health Benefits & Side Effects: చేపలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, దుష్ప్రభావాలు

Health Benefits Of Fish in Telugu: చేపలవల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అన్ని మాంసా పదార్ధాల్లో చేపలు చాలా ప్రత్యేకం ఎందుకంటే వీటిలో కొవ్వు పదార్ధాలు చాలా తక్కువ. కోడి మాంసం, మేక మాంసం కంటే చేప మాంసమే ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే చేపల వల్ల కొన్ని దుష్ప్రయోజనాలు కూడా ఉన్నాయి. చేపల గురించిన మరిన్ని విషయాలను ఈ ఆర్టికల్ లో మనము తెలుసుకుందాము.

benefits-and-side-effects-of-fish

రెండు రకాల చేపలు

చేపలు రెండు రకాలుగా ఉంటాయి. జిడ్డు చేపలు, జిడ్డు లేని చేపలు. జిడ్డు చేపల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. సాల్మన్, ట్రౌట్, మేకెరెల్, హెర్రింగ్, సార్డినెస్, పిచ్చార్డులు, కిప్పర్, ట్యూనా, హిల్స్సా, కత్తిచేప, కార్ప్, లాంటివి జిడ్డు చేపలు.

జిడ్డు లేని చేపల్లో మాంసం ఎక్కువగా తెల్లగా ఉంటుంది. వీటిలో 2 శాతం కొవ్వు ఉంటుంది. జిడ్డు చేపలు – కాడ్, హాడాక్, ప్లాయిస్, లెమన్ కాలే, కోలే, టిన్నెడ్, ట్యూనా, సిబాస్ మొదలైనవి

100 గ్రాముల చేపట్లో ఉండే పోషకాలు, మినరల్స్, విటమిన్స్

  • నీరు – 68.5 గ్రాములు
  • శక్తి – 142 కిలో కేలరీలు
  • ప్రొటీన్ – 19.84 గ్రాములు
  • కొవ్వులు – 6.34 గ్రాములు
  • కాల్షియం – 12 మిల్లీగ్రాములు
  • ఐరన్ – 0.80 మిల్లీగ్రాములు
  • మెగ్నీషియం – 29 మిల్లీగ్రాములు
  • ఫాస్పారస్ – 200 మిల్లీగ్రాములు
  • పొటాషియం – 490 మిల్లీగ్రాములు
  • సోడియం – 44 మిల్లీగ్రాములు
  • జింక్ – 0.64 మిల్లీగ్రాములు
  • విటమిన్ – బి1:0.226 మిల్లీగ్రాములు
  • విటమిన్ బి2: 0.380 మిగ్రా
  • విటమిన్ బి3: 7.86 మిగ్రా
  • విటమిన్ బి12: 0.96 మిగ్రా
  • విటమిన్ ఎ: 12మిగ్రా
  • విటమిన్ ఇ: 3.92మిగ్రా
  • మోనోఅన్శాచురేటెడ్ ఫ్యాట్ – 2.103 గ్రా
  • పాలీఅన్శాచురేటెడ్ – 2.539గ్రా
  • కొలెస్ట్రాల్ – 55మిగ్రా

చేపల వళ్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

  • గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి చేప చాలా మంచిదని అనేక అధ్యయనాల్లో తేలింది.
  • చేపల్లో ఉండే ఒమేగా – 3 కొవ్వు ఆమ్లాలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, మెదడులో రక్తాన్ని గడ్డకట్టకుండా కూడా చేస్తుంది. చేపలతో స్ట్రోకులు తగ్గే అవకాశం ఉంది.
  • చేపల తింటే కళ్లకు చాలా మంచిది. దృష్టిని మరో 4 శాతం వృద్ధి చేస్తుందని అధ్యయనంలో కనుగ్గొన్నారు.
  • కీళ్లనొప్పులకు, వాపులు తగ్గడానికి చేేపలు బాగా దోహదపడతాయని చెబుతారు. చేపలు తింటే ఎముకల్లో సాంద్రత కూడా పెరిగి విరిగే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయని చెబుతున్నారు.

చేపల వల్ల కలిగే దుష్ప్రయోజనాలు

  • చేపల్లో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లం చక్కెర స్థాయిని పెంచే అవకాశాలు ఉన్నట్లు పరిశోధనల్లో కనుగ్గొన్నారు.
  • కొన్ని సముద్రం చేపలు సముద్రంలోకి వదిలిన మెర్క్యురీని ఆహారంగా తీసుకుంటాయి. ఇలాంటి చేపలను తింటే ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంది.
  • చేపల్లో ఎన్నో పోషకాలు ఉన్నప్పటికీ రోజూ చేపలు తినడం మంచిది కాదు. మితంగా, డాక్టర్ పర్యవేక్షనలోనే చేపలు తినడం ఆరోగ్యానికి శ్రేయస్కరం

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు