Health Benefits Of Ajwain: వాము వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, దుష్ప్రయోజనాలు

Health Benefits Of Ajwain: వాము మన వంటగదుల్లో ఉన్నప్పటికీ దీనిని కూరల్లో వంటకంలో ఎక్కువగా ఉపయోగించము. దగ్గు, జలుబు వస్తే ఈ వామును చిట్కాలో ఉపయోగించి సేవిస్తారు. ఈజిప్టులో మసాలా దినుసులలో ఈ వాము ఒకటి. ఆయుర్వేదంలో, ఔషధ తయారీలో ఈ వాముకు ప్రముఖమైన స్థానం ఉంది. వాము కలిగించే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి, ఇంకా దుష్ప్రయోజనాల గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాము.

benefits-and-side-effects-of-ajwain

కడుపునొప్పిని వాము వెంటనే తగ్గిస్తుంది. థైమ్ అనే మొక్క నుంచి ఈ వాము గింజలు వస్తాయి. ఈ థైమ్ మొక్క 60 నుంచి 90 మీటర్ల పొడవు పెరుగుతుంది. వాము గింజలు ఆకుపచ్చ, గోదుమ రంగులో ఉంటాయి. వాటి పై భాగంలో స్పష్టమైన గీతలు కలిగి ఉంటాయి.

వాము వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

  • వాము మహిళలకు చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే స్పాస్మోడిక్ ప్రభావాలు పొత్తి కడుపులో నొప్పిని, మలబద్దకాన్ని తగ్గించి ఉపశమనాన్ని కలిగిస్తాయి. పాలిచ్చే తల్లులకు వాము ఇస్తే, పాల సరఫరాని మెరుగుపరుస్తుంది.
  • వాములో యాంటీమైక్రోబయాల్, యాంటీయాక్సిడెంట్లు ఉంటుాయి. కడుపులో ఏదైనా బ్యాక్టీరియా, నులిపురుగులు లాంటివి ఉంటే చంపేస్తాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉండడంతో ఆర్థరైటిస్ నొప్పిని కూడా తగ్గిస్తాయి.
  • రోజూ 2 గ్రాముల వాము తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే డాక్టర్లను సంప్రదించిన తరువాతే వీటిని తీసుకోవాలి.
  • ఆయుర్వేదం ప్రకారం వాములో వేడిని పెంచే లక్షణాలు ఉంటాయి. జలుబు ఉన్నవారు వామును తీసుకుంటే అది వెంటనే తగ్గిపోతుంది.

వాము టీని ఇలా తయారు చేసుకోండి?

  • 1 కప్పులో వాము తీసుకోండి
  • గిన్నెలో మరిగించిన నీటిని ఒక కప్పులో తీసుకోవాలి
  • వాము నీటిని రెండింటినీ కలపాలు
  • 5-6 నిమిషాల తరువాత నీరు గోదుమ రంగులోకి మారిపోతుంది.
  • ఈ మిశ్రమంలో మీరు కొంత తేనె లేదా చక్కెర వేసుకొని కలుపుకోవాలి.
  • మీ వాము టీ రెడీ. దీనికి వేడిగా తీసుకుంటే చాలా మంచిది.

 వాము వల్ల కలిగే దుష్ప్రభావాలు

  • వాములో వేడిని పెంచే లక్షణం ఉంటుంది. కాబట్టి ఒంట్లో వేడి ఉన్నవారు వామును తీసుకోకపోవడం మంచిది
  • కొందరి పిల్లల్లో వాము ప్రతికూల ప్రభావాన్ని చూపించవచ్చు. కాబట్టి డాక్టర్ సలహా తీసుకున్న తరువాతే వామును పిల్లలకు ఇవ్వండి
  • వాము చాలా ఘాటుగా ఉంటుంది. కాబట్టి దీనిని పసిపిల్లలకు ఉపయోగించేటప్పుడు ఖచ్చితంగా డాక్టర్ సలహాను తీసుకోవాలి.

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు