Ginger Health Benefits: అల్లం లేదు బెల్లం లేదు అనే మాటా వినే ఉంటారు. బెల్లం ఎంత తీపిగా ఉంటుందో అల్లం అంత ఘాటుగా ఉంటుంది. అల్లం లేనిదే ఏ కూర పూర్తి కాదు. అల్లం లేకుంటే బిర్యానీలో రుచి తగ్గుతుంది. అల్లం టీ తీసుకుంటే తలనొప్పి చిటికెలో మాయం అవుతుంది. జీర్ణ క్రియలో అల్లం చాలా దోహదం చేస్తుంది. ఆయుర్వేదం, యునానీ వైద్యంలో అల్లం కు ప్రముఖమైన స్థానం ఉంది. అల్లం పేరు దాని సంస్కృత పదం శింగవేరం నుంచి వచ్చింది. అల్లం కు సంబంధించిన మరిన్ని విశేషాలను మనము ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం

100 గ్రాముల అల్లంలో ఉండే పోషకాలు
- నీరు – 78.9 గ్రాములు
- కార్బోహైడ్రేట్లు 17.7 గ్రాములు
- ఫైబర్ 2 గ్రాములు
- ప్రొటీన్ 1.8 గ్రాములు
- కొవ్వులు – 0.75 గ్రాములు
- కాల్షియం – 16 మిగ్రా
- మెగ్నీషియం – 43 మిగ్రా
- పొటాషియం – 415 మిగ్రా
- విటమిన్ సి – 5మిగ్రా
- శక్తి – 80కిలో కేలరీలు
అల్లతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
- గర్భిణుల్లో వికారం, వాంతులు తగ్గడంలో అల్లం చాలా దోహదం చేస్తుంది. కొందరు ప్రయాణంలో వాంతులు చేసుకుంటారు. అలాంటి వారికి అల్లం బాగా పనిచేస్తుంది.
- అల్లం ఆకలిని అణచివేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు తమ ఆహారలో అల్లంను భాగంగా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
- అల్లం జిర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపులో మంటను గ్యాస్ ను తగ్గిస్తోంది.
- మహిళల్లో రుతుక్రమ సమస్యలను అల్లం నివారిస్తుంది. అల్లం రుతుస్రావంలో రక్తప్రవాహాన్ని తగ్గిస్తుందని, మలబద్దకాన్ని తగ్గిస్తుందని అనేక అధ్యయనాల్లో తేలింది.
- జుట్టు ఒత్తుగా పెరగడానికి, బలంగా పెరగడానికి కూడా అల్లం దోహదం చేస్తుంది. అల్లంలో ఉండే కాల్షియం, మెగ్నీషియం, 6-జింజెరోల్, ఖనిజాలే ఇందుకు కారణం
- బాడీలో రక్తం గడ్డకట్టడానికి సహాపడే థ్రోంబోక్సేన్ హార్మోన్ ను ఇది నిరోధిస్తుంది, దీంతో అల్లం రక్తం గడ్డకట్టకుండా కూడా చేస్తుంది అని అధ్యయనంలో తేలింది.
అల్లం తో కలిగే దుష్ప్రయోజనాలు
- శ్రుతి మించి అల్లం వాడితే గుండెలో కడుపులో మంట, విరేచనాల సమస్యలు కలుగుతాయి.
- అల్లంలో రక్తపోటును తగ్గించే లక్షణాలు ఉన్నాయి. మీరు రక్తపోటుకు సంబంధించి ఏవైనా మందులు వాడితే అల్లం తీసుకోకపోవడం మంచిది
- మీరే ఏవైనా ఔషదాలు తీసుకుంటుంటే.. అల్లం తీసుకునే ముందు ఒకసారి వైద్యుడిని సంప్రదించడం చాలా మంచిది.
- అల్లంలో ఎన్నో పోషకాలు ఉన్నప్పటికీ.. గర్భిణులు అల్లం తీసుకోకపోతేనే ఆరోగ్యానికి, కడుపులో బిడ్డకు చాలా మంచిది.
ఇవి కూడా చూడండి
- Health Benefits Of Ajwain: వాము వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, దుష్ప్రయోజనాలు
- Fish Health Benefits & Side Effects: చేపలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, దుష్ప్రభావాలు
- Cinnamon Health Benefits: దాల్చిన చెక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, దుష్ప్రయోజనాలు
- Health Benefits Of Lemon: నిమ్మకాయతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, దుష్ప్రభావాలు