Health Benefits Of Pistachio: పిస్తా లేనిదే డ్రైఫ్రూట్స్ లిస్ట్ పూర్తి కాదు. పిస్తాకు పెద్ద చరిత్రే ఉంది. వేల సంవత్సరాలుగా పిస్తాను ఆహారంలో ఉపయోగిస్తున్నారు. బైబిల్ లో కూడా పిస్తా ప్రస్తావణ వచ్చింది. సుమారు క్రీపూ. 6750 నుంచే పిస్తాను ఆహారంలో భాగంగా ఉపయోగిస్తున్నట్లు పురావస్తు శాస్త్రవేత్తలు కనుగ్గొన్నారు. ప్రస్తుతం పిస్తాను యునైటెడ్ స్టేట్స్, ఇరాన్ ఈ రెండు దేశాలే ప్రపంచంలోని 76 శాతం పిస్తాను పిండిస్తాయి.
పిస్తాలో పోషకాలు మెండుగా ఉంటాయి. బాదం, కాజులో కన్నా పిస్తాలో పోషకాలు ఇంకొన్ని ఎక్కువ ఉంటాయి. కేక్, ఐస్ క్రీం, చాక్లెట్ల తయారీలో పిస్తాను ఉపయోగిస్తారు.
100 గ్రాముల పిస్తాలో ఉండే పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు
- శక్తి – 560 కిలో కేలరీలు
- నీరు – 4.37గ్రా
- కార్బోహైడ్రేట్ – 27.17 గ్రా
- ప్రొటీన్ – 20.6 గ్రా
- ఫ్యాట్ – 45.32 గ్రా
- డైటరీ ఫైబర్ – 10.6 గ్రా
- చక్కెర – 7.66 గ్రా
- కాల్షియం – 105 మిల్లీగ్రాములు
- ఐరన్ – 3.92 మిల్లీగ్రాములు
- మెగ్నీషియం – 121 మిల్లీగ్రాములు
- ఫాస్ఫరస్ – 490 మిల్లీగ్రాములు
- పొటాషియం – 1025 మిల్లీగ్రాములు
- జింక్ – 2.20 మిల్లీ గ్రాములు
- కాపర్ – 1.30 మిల్లీ గ్రాములు
- మాంగనీస్ – 1.2 మిల్లీగ్రాములు
- విటమిన్ బి3 – 1.3 మిల్లీగ్రాములు
- విటమిన్ బి2 – 0.16 మిల్లీగ్రాములు
- విటమిన్ బి1 – 0.87 మిల్లీగ్రాములు
- విటమిన్ బి6 – 1.7 మిల్లీగ్రాములు
- విటమిన్ ఇ – 2.86మిల్లీగ్రాములు
- సాచురేటెడ్ – 5.907 గ్రాములు
- మోనోఅన్సాచురేటెడ్ – 23.257 గ్రాములు
- పోలి అన్సాచురేటెడ్ – 14.380 గ్రా
పిస్తాపప్పు ఆరోగ్య ప్రయోజనాలు
- ఇప్పుడున్న అన్ని గింజల్లోకి పిస్తా చాలా ఆరోగ్యకరమైన గింజ. దీనిలో శక్తి పుష్కలంగా ఉంటుంది. అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వు కూడా ఉంటుంది. మీమ్మల్ని ఎప్పుడూ యవ్వనంగా ఉంచుతుంది.
- ఆకుపచ్చ, ఉదా రంగులో ఉండే పిస్తాలో లౌటిన్, ఆంథోసయానిన్ లాంటి పిగ్మిెంట్లు ఉంటాయి. ఇవి మీ జ్ఞానాన్ని మెరుగుపరచడంలో చాలా దోహదపడతాయి.
- పిస్తాపప్పుల్లో డైటరీ ఫైబర్ ఉంటుంది. కాబట్టి మీరు బరువు పెరిగే అవకాశము ఉండదు. బరువును తగ్గించడంలో కూడా పిస్తా దోహదపడుతుంది.
- పిస్తాపప్పులు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయని అధ్యయనంలో తేలింది. ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలను కూడా పిస్తాపప్పులు నియంత్రిస్తాయని పరిశోధకులు కనుగ్గొన్నారు. కాబట్టి పిస్తా మధుమేహం ఉన్న వారికి బాగా దోహదపడుతుంది.
పిస్తాతో కలిగే దుష్ప్రభావాలు
- ఏరకమైన ఎలర్జీలతో బాధపడుతున్నా.. ముందు డాక్టర్ సలహా తీసుకున్న తరువాతే పిస్తాను తీసుకోవాలి.
- పిస్తా గింజల్లో ప్రొటీన్ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది పరోక్షంగా బరువు పెరగడానికి కారణం అవుతుంది.
- అఫ్లాటాక్సిన్ క్యాన్సర్ కు కారణం అవుతుంది. దేనినైనా నిల్వ ఉంచితే దాంట్లో ఈ అఫ్లాటాక్సిన్స్ పెరిగే అవకాశముంది. పిస్తాలో ఇవి పెరుగుతున్నట్లు పరిశోధకులు గమనించారు. కాబట్టి నిల్వ ఉంచిన పిస్తాను తినవద్దు.
- పిస్తాపప్పుల్లో ఆక్సాలెట్లు, మెథియోనిన్ను సమృద్ధిగా ఉంటాయి. ఇవి మూత్రపిండాళ్లో రాళ్లు పెరగడానికి దోహదపడతాయి. కాబట్టి ఎక్కువగా పిస్తా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు.
ఇవి కూడా చూడండి
- Benefits Of Almonds: బాదంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు దుష్ప్రభావాలు
- Figs Health Benefits: అంజీరముతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, దుష్ప్రభావాలు
- Safflower Benefits: కుసుమ నూనెతో కలిగే ప్రయోజనాలు
- Ginger Health Benefits: అల్లంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు దుష్ప్రభావాలు