Ascoril LS Syrup Uses: ఆస్కారిల్ ఎల్ఎస్ సిరప్ ను ముఖ్యంగా గొంతు ఛాతికి సంబంధించిన వ్యాధులు నయం కావడానికి డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తారు. ఈ సిరప్ ముఖ్యంగా దగ్గు, ఆస్తమా, తీవ్రమైన గొంతు నొప్పి, జలుబు, ఊపిరితిత్తుల్లో మంట, ఊపిరితిత్తుల వాపుల నుంచి మనల్ని రక్షిస్తుంది.
ఈ ఆస్కారిల్ ఎల్ఎస్ సిరప్ లో ఉండే ఖనిజాలు, ఆమ్బ్రాక్సాల్, గువాఫెనెసిన్, లెవొసాల్బుటమోల్. ఈ ఔషదం కేవలం సిరప్ రూపంలోనే మనకు లభిస్తుంది. ఆస్కారిల్ ఎల్ఎస్ సిరప్ కు సంబంధించిన మరిన్ని విశేషాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం
ఆస్కారిల్ ఎల్ఎస్ సిరప్ తో ఈ కింది రోగాలు, సమస్యలు నయం అవుతాయి
- దగ్గు
- ఛాతీ రద్దీ
- ఆస్తమా
- తీవ్రమైన గొంతు
- చిక్కగా శ్లేష్మం దగ్గు
- పట్టు జలుబు
- ఊపిరితిత్తుల్లో మంట
- ఊపిరితిత్తుల వాపు
ఆస్కారిల్ ఎల్ఎస్ సిరప్ తో కలిగే దుష్ప్రభావాలు
- దడ, భయం
- నోరు, గొంతు ఎండిపోవడం
- నిద్రలేమి
- అజీర్ణం
- పొత్తి కడుపు నొప్పి
- వాంతులు
- విరేచనాలు
- అలసట
- మైకము
- కండరాల తిమ్మిరి
- తలనొప్పి
- భయము
- వికారం
- మార్పు రుచి
- కడుపు నొప్పి
- రాషస్
ఈ కింది మందులను తీసుకుంటుంటే ఆస్కారిల్ ఎల్ఎస్ సిరప్ ను వేసుకోవద్దు
- Antibiotics
- Bendroflumethiazide
- Carvedilol
- Nadolol
- Sotalol
- Timolol
ఈ పరిస్థితులు ఉంటే ఆస్కారిల్ ఎల్ఎస్ సిరప్ తీసుకోవద్దు
- అలెర్జీ ప్రతిచర్యలు
- దగ్గు ఎక్కువగా ఉన్నట్లయితే
- గర్భిణులు
- పాలిచ్చే తల్లులు
- శ్వాస ఇబ్బంది
- అధిక రక్తపోటు గుండె జబ్బు ఉన్నవారు
- సిరప్ తీసుకున్న 14 రోజుల తరువాత కూడా ఆరోగ్యం మెరుగుపడకపోతే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి
- మద్యం సేవిస్తే.. ఈ సిరప్ తీసుకోవద్దు
- కాలేయం, మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు కూడా ఈ సిరప్ వేసుకోవద్దు
- ఆస్కారిల్ ఎల్ ఎస్ సిరప్ బాటిల్ ఓపెన్ చేస్తే.. 4 వారాల్లోనే దానిని ఉపయోగించాలి. ఆ తరువాత కొత్త సిరప్ బాటిల్ ను ఉపయోగించండి
ఆస్కారిల్ ఎల్ ఎస్ సిరప్ తీసుకుంటున్నప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు
- ఈ సిరప్ బాటిల్ ను పిల్లలకు దూరంగా ఉంచండి. పసిపిల్లకు పెద్దలకు వేరు వేరుగా ఈ సిరప్ ను అందుబాటులోకి తెచ్చారు. ముఖ్యంగా జలుబు జ్వరం ఉన్న పసిపిల్లలకు కూడా ఈ సిరప్ ను అందిస్తారు. అయితే అవి ఆస్కారిల్ ఎల్ ఎస్ జూనియర్ సిరప్ పేరుతో ఉన్నాయి.
- నార్మల్ రూం టెంపరేచర్ లోనే ఈ సిరప్ బాటిల్ ను స్టోర్ చేయాలి. సూర్య రష్మి నేరుగా పడే ప్లేస్ లో దీనిని వుంచరాదు
- సిరప్ తాగే ముందు మరొక్కసారి ఆ బాటిల్ ఎక్స్పైరీ డేట్ ను క్రాస్ చెక్ చేసుకోవడం మంచిది.
ఇవి కూడా చూడండి
- Supradyn Tablet Uses: సుప్రాడిన్ టాబ్లెట్ ఉపయోగాలు, దుష్ప్రభావాలు, ఏయే టాబ్లెట్లతో కలిపి తీసుకోవద్దు
- Mucinac 600 Tablet Uses: ముసినాక్ 600 ట్యాబ్లెట్ ఉపయోగాలు, దుష్ప్రయోజనాలు, ఏయే టాబ్లెట్లతో కలిపి తీసుకోకూడదు
- Omee Tablet Uses: ఒమీ ట్యాబ్లెట్ ఉపయోగాలు, దుష్ప్రభావాలు, వేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- Dexona Tablet Uses: డెక్సోనా ట్యాబ్లెట్ ఉపయోగాలు, దుష్ప్రభావాలు, ఏయే టాబ్లెట్ల కాంబినేషన్స్ తో తీసుకోవద్దు