Omicron Symptoms In Telugu: ఓమిక్రాన్ లక్షణాలు

Omicron Symptoms In Telugu: కరోనా తరువాత ఓమిక్రాన్ వైరస్.. ప్రపంచాన్ని కబళియ్యబోతుంది. ఈ వైరస్ దక్షిణాఫ్రికాలో గత నెల 24న వెలుగులోకి వచ్చింది. కేవలం మూడు రోజుల్లోనే ఓమిక్రాన్.. 18 దేశాలకు వ్యాపించిపోయింది. అయితే ఈ కొత్త వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయి. కరోనా సోకితే వచ్చే symptoms కి, omicron symptoms కి ఏవైనా పోలికలు ఉన్నాయా అనే ప్రశ్నలు అనేక మందికి తలెత్తాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇక్కడ మీకు అందిస్తున్నాము.

ఓమిక్రాన్ లక్షణాలు (Omicron Symptoms In Telugu)

ఇప్పటివరకు కనుగ్గొన్న దాన్ని బట్టి symptoms విశయంలో ఓమిక్రాన్ కి, చికెన్ గున్యాకి దగ్గరి పోలికలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఓమిక్రాన్ రోగులు విపరీతమైన అలసటకు గురౌతారు, కండరాల నొప్పి, పొడిదగ్గు, గొంతులో గరగర లాంటి లక్షణాలు ఉంటాయి. అయితే కొందరిలో విపరీతమైన జ్వరం కూడా వస్తుందని తేలింది.

ఓమిక్రాన్ సోకితే వచ్చే లక్షణాలు: 

విపరీతమైన అలసట

కండరాలనొప్పి

తలనొప్పి

కొందరిలో జ్వరం

వైరల్ ఫీవర్ లక్షణాలు

పొడి దగ్గు, గొంతులో గరగర

ఆఫ్రికా లో ఓమిక్రాన్ సోకిన వారిలో సగం మందికి పైగా కోవిడ్ వాక్సిన్ తీసుకోని వారేనని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. రెండు డోసుల కరోనా వాక్సిన్ తీసుకుంటే ఓమిక్రాన్ గురుంచి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికీ ఇంకా వాక్సిన్ తీసుకొని వారు ఉంటే వెంటనే తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం ప్రజల్ని కోరుతుంది. ఓమిక్రాన్ వల నుంచి బయటపడాలంటే ప్రస్తుతానికి covid వాక్సిన్ మాత్రమే పరిష్కారమని కూడా చెబుతున్నారు.

మరిన్ని వార్తలు:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు