Kalonji Seeds In Telugu: కలోంజీ సీడ్స్ ఉపయోగాలు

Kalonji Seeds In Telugu: కలోంజీ సీడ్స్ ఇప్పుడు చాలా పాపులర్. వీటిని నల్ల జీలకర్ర, షాజీరా అని కూడా అంటారు. వంటలో ఎక్కువగా వాడే ఈ కలోంజీ సీడ్స్, ఆయుర్వేద వైద్యం, బ్యూటీ టిప్స్ లో కూడా ఉపయోగిస్తుంటారు. ఈ నల్ల జీలకర్రకు పెద్ద చరిత్రే ఉంది. వీటిని ఈజిప్ట్ లో సుగంధ ద్రవ్యంగా ఉపయోగిస్తుంటారు. ప్రాచీన కాలం నుంచే వీటిని అనేక దేశాలు, తమ వంటలో, వైద్యంలో చిట్కాలో ఉపయోగిస్తున్నారు.

కలోంజీ సీడ్స్ ఉపయోగాలు (Kalonji Seeds In Telugu)

ఈ కలోంజీ సీడ్స్ రుచిలో మిరియాల్లా ఉంటాయి. వీటిని ఎక్కువగా సూప్స్, బిస్కేట్స్, బ్రెడ్ తయారీలో ఉపయోగిస్తుంటారు. ఇతర డ్రై ఫ్రూప్ట్స్ కు ఉండే ఇమ్మ్యూనిటి, పోషకాలు, ఈ నల్ల జీలకర్రలో ఉంటాయి. విటమిన్ బి 1, బి 2, బి 3, ఫోలిక్ ఆసిడ్, జింక్ లాంటి ఇతర పోషకాలు ఇందులో మెండుగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.

కలోంజీ సీడ్స్ వళ్ళ ఎలాంటి దుష్ఫలితాలు లేవు. వీటిని ఆహారంలో తీసుకోవడం వళ్ళ ఎన్నో ఆరోగ్య సమస్యలనుంచి బయటపడతారు. డయాబెటిస్, ఆస్తమా, తలనొప్పి, బ్లడ్ ప్రెషర్, నుంచి ఉపశమనం పొందవచ్చు. తేనెలో కొంత నల్ల జీలకర్ర పొడి, వెల్లుల్లి వేసి కలుపుకొని తాగితే జలుబు దగ్గు తగ్గుతాయి. బ్లాక్ టీ లో అర టీ స్పూన్ కలోంజి పొడి వేసుకొని తాగినా మంచి ఫలితాన్ని ఇస్తుంది.

ఆలస్యం చేయకుండా మార్కెట్ నుంచి కలోంజి సీడ్స్ ఇంటికి తెచ్చుకోండి. కొత్త వైరస్ లను ఎదుర్కోవాలన్నా, కొంత ఇమ్మ్యూనిటీ పెంచుకోవాల్సిందే. మందులు వాడే పరిస్థితి రాకుండా ప్రతీరోజు వేడినీటిలో తేనె, కొంత కలోంజీ సీడ్స్ పొడి వేసుకొని కషాయంలా తాగండి, ఆరోగ్యంగా ఉండండి.

మరిన్ని వార్తలు:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు