అత్యధిక పోషక విలువలున్న 25 ఆహార పదార్థాలు ఇవే

ప్రొటీన్లు, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు, మినరల్స్.. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి ఎన్నో రకాల పోషకాలు కావాలి. అన్ని పోషకాలూ ఒకే దాంట్లో దొరికితే, ఇక వేరే పదార్థాలేవీ తినకుండా ఆ ఒక్క ఆహారమే తీసుకుంటే సరిపోతుంది.

కానీ అలా అన్ని పోషకాలూ కలిగిన పదార్థమేదీ ప్రకృతిలో లేదు. అందుకే, కొన్ని రకాల పదార్థాలను కలిపి తినడం ద్వారా రోజువారీ అవసరాలకు సరిపడా పోషకాలను శరీరానికి అందించొచ్చు. వేల కొద్దీ ఆహార పదార్థాల్లో శరీరానికి ఎక్కువ మేలు చేసేవి ఏవో కనిపెట్టడం కాస్త కష్టమే. అందుకే ఆ బాధ్యతను కొందరు శాస్త్రవేత్తలు భుజాన వేసుకున్నారు. వెయ్యికి పైగా ఆహార పదార్థాలపై అధ్యయనం జరిపి, అత్యధిక పోషకాలు కలిగిన వంద పదార్థాలను ఎంపిక చేశారు. వాటిలో ఉండే పోషకాల ఆధారంగా ర్యాంకులను కేటాయించారు. రోజు వారీ అవసరానికి సరిపడా పోషకాలను శరీరానికి అందించడానికి అవి సాయపడతాయని పేర్కొన్నారు. అలా శాస్త్రవేత్తలు ప్రకటించిన పోషకాహార ర్యాంకుల్లో తొలి 25 స్థానాల్లో ఉన్నవి ఇవే.

కారం
శక్తి: 100గ్రాములకు 282 కి.క్యాలరీలు
విటమిన్ సి, ఇ, ఏ లాంటి ఫైటో కెమికల్స్‌తో పాటు కెరొటినాయిడ్లు, ఫినోలిక్ పదార్థాలు పచ్చికారంలో సమృద్ధిగా ఉంటాయి.

గడ్డకట్టిన పాలకూర
శక్తి: 100గ్రాములకు 29 కి.క్యాలరీలు
మెగ్నీషియం, ఫోలేట్, విటమిన్ ఏ తోపాటు బీటా కెరొటిన్, జియాజాంతిన్ లాంటి పోషకాలు పాలకూరలో పుష్కలం. పాలకూరను ఫ్రీజర్‌లో ఉంచడం వల్ల ఆ పోషకాలను కోల్పోకుండా ఉంటుంది. అందుకే తాజా పాలకూర (45)తో పోలిస్తే గడ్డకట్టిన పాలకూరకే పోషకాహర జాబితాలో మెరుగైన ర్యాంకు దక్కింది.

సింహ దంతి (డండెలయన్ గ్రీన్స్)
శక్తి: 100గ్రాములకు 45 కి.క్యాలరీలు
డండెలయన్ అంటే సింహపు దంతాలని అర్థం. సింహ దంతి మొక్క ఆకుల్లో విటమిన్ సి, విటమిన్ ఏ తోపాటు కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది.

పింక్ గ్రేప్ ఫ్రూట్
శక్తి: 100గ్రాములకు 42 కి.క్యాలరీలు
చూడ్డానికి ఇవి నారింజ పండ్లలానే ఉంటాయి. కెరొటినాయిడ్లు, లైకోపీన్ పిగ్మెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల వీటి లోపలి భాగం ఎర్రగా ఉంటుంది.

స్కాలప్స్ (చిప్పలు)
శక్తి: 100గ్రాములకు 69 కి.క్యాలరీలు
నీటివనరుల్లో దొరికే ఈ స్కాలప్స్‌లో కొవ్వు పదార్థాలు తక్కువ, ప్రొటీన్, ఫ్యాటీ ఆమ్లాలు, పొటాషియం, సోడియంలు ఎక్కువ.

పసిఫిక్ కాడ్
శక్తి: 100గ్రాములకు 72 కి.క్యాలరీలు
పసిఫిక్ మహాసముద్రంలో దొరికే ఈ చేప లివర్‌ నుంచి సేకరించే నూనెలో ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ డి అధికంగా ఉంటాయి.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు