కరోనావైరస్: వ్యాక్సీన్ వేసుకున్నా, వైరస్‌ సంక్రమించే ప్రమాదాన్ని పెంచే 4 అంశాలు – voiceofandhra.net

కోవిడ్-19 వ్యాక్సీన్ రెండో డోసు తీసుకున్న రెండు వారాల తర్వాత, టీకా నుంచి ఏర్పడే రక్షణ గరిష్ఠ స్థాయిలో ఉంటుంది.

అప్పుడే ఒక వ్యక్తి పూర్తి వ్యాక్సీన్ తీసుకున్నట్లు చెప్పవచ్చు. ఆ తర్వాత కూడా ఆ వ్యక్తికి కోవిడ్-19 సోకితే, దాన్ని ‘బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్‌’గా పరిగణిస్తారు. అంటే టీకాలు వేసుకోనివారికి సోకినట్లే, వేసుకున్నవారికి కూడా కోవిడ్ వస్తుంది. అయితే ఇందులో కొన్ని తేడాలు ఉండొచ్చు. ఒక వ్యక్తి ఇప్పటికే రెండు డోసులూ వేసుకుని ఉంటే ఈ కింది విషయాలు గుర్తుంచుకోవాలి.

కోవిడ్-19 లక్షణాలపై జరిగిన పరిశోధనల ప్రకారం, టీకా వేసుకున్న వ్యక్తుల్లో తలనొప్పి, ముక్కు కారడం, తుమ్ములు, గొంతు నొప్పి, వాసన కోల్పోవడంలాంటి ఐదు లక్షణాలు కనిపిస్తాయి. టీకా వేసుకోని వారికి కోవిడ్ సోకినప్పుడు ఈ లక్షణాల్లో కొన్ని వారిలో కూడా కనిపిస్తూ ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి తలనొప్పి, గొంతు నొప్పి, ముక్కు కారటం అనే మూడు లక్షణాలు. అయితే టీకా వేసుకోని వారిలో ఉండే మిగతా రెండు ప్రధాన వ్యాధి లక్షణాలు జ్వరం, నిరంతర దగ్గు.

ఈ రెండు లక్షణాలు కోవిడ్-19ని సూచించే సాధారణ లక్షణాలు. అయితే టీకా వేసుకున్న వారిలో ఇవి చాలా తక్కువగా కనిపిస్తుంటాయి. టీకా వేసుకోని వారితో పోలిస్తే, వ్యాక్సీన్ వేసుకున్న వారికి కరోనా సోకితే జ్వరం వచ్చే అవకాశం 58 శాతం తక్కువ అని ఒక అధ్యయనంలో తేలింది. చాలా మందికి, కోవిడ్-19 టీకా తర్వాత చలిగా అనిపిస్తుంది. అలాంటి వారికి ఈ వ్యాధి వస్తే, వారు ఆస్పత్రి పాలయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సంక్రమణ ప్రారంభ దశలో వారికి తక్కువ లక్షణాలు ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు వీరికి దీర్ఘకాలంలో ఆ వ్యాధి సోకే అవకాశం తక్కువ. వైరస్ సోకకుండా టీకా పూర్తిగా అడ్డుకోలేకపోయినప్పటికీ, వ్యాధి సోకినపుడు దాని తీవ్రత ఎక్కువ కాకుండా కాపాడుతుంది.

బ్రిటన్‌ జనాభాలో 0.2 శాతం లేదా 500 మందిలో ఒకరికి రెండు డోసుల టీకా వేసుకున్న తర్వాత కూడా కరోనా సోకుతున్నట్లు ఒక పరిశోధనలో తేలింది. కానీ ఈ ముప్పు అందరికీ ఒకేలా ఉండదు. టీకా తీసుకున్న తర్వాత దాని రక్షణను నాలుగు అంశాలు ప్రభావితం చేస్తాయి.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు