Triphala Churna Uses In Telugu: త్రిఫల చూర్ణం ఉపయోగాలు

Triphala Churna Uses In Telugu: త్రిఫల చూర్ణానికి ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యత ఉన్నది. త్రిఫల చూర్ణాన్ని సేవిస్తే కడుపు శుధ్ది అవటమే కాకుండా, క్రిమికీటకాలు ఏమన్నా ఉన్నా పూర్తిగా తొలగిపోతాయి. అయితే ఈ త్రిఫల చూర్ణాన్ని ఎలా తయారు చేస్తారు. ఎలా సేవిస్తారు, దీని వల్ల ఇంకే ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం

Triphala Churna Uses In Telugu

త్రిఫలం అంటే “3 పండ్లు”.. ఉసిరి కాయ, కరక్కాయ, తానికాయలతో కలిపిన పొడినే త్రిఫల చూర్ణం అంటారు. ఈ త్రిఫల చూర్ణానికి త్రిదోష రసాయనం అని కూడా పేరు ఉంది.

త్రిఫల చూర్ణంలో అనేక ఔషధ గుణాలున్నాయి. మలబద్ధకాన్ని పోగొడుతుంది. కరక్కాయ కాలేయ లోపాలను సరిదిద్దుతుంది. తానికాయ ఆస్తమాను కంట్రోల్ చేస్తుంది. జీర్ణవ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది.

త్రిఫల చూర్ణాన్ని రెగులర్ గా తీసుకుంటే రుతుచక్ర సమస్యలు కూడా తీరతాయి. గుండె, కళ్లు, వెంట్రుకలు, చర్మానికి కూడా ఈ చూర్ణం ఎంతో మేలు చేస్తుంది. జ్ఞాపకశక్తిని కూడా ఈ చూర్ణం పెంచుతుంది.

వైద్యుడిని సంప్రదించి రోజుకు 2 లేదా 5 గ్రాముల త్రిఫల చూర్ణాన్ని తీసుకోవచ్చు. తేనె నీటిలో కలిపి పరిగడుపున అంటే.. ఉదయాన్నే ఖాలీ కడుపుతో ఉన్నప్పుడు సేవించాలి లేదా సాయంత్రం సమయంలో తీసుకోవచ్చు. అయితే ఈ త్రిఫల చూర్ణాన్ని తీసుకోవడంలో కూడా శృతిమించవద్దు. ఎక్కువగా తీసుకుంటే శరీరంపై నెగెటివ్ ఎఫెక్ట్ పడుతుంది.

త్రిఫల చూర్ణంలో ఉండే కరక్కాయా చాలా పవర్ఫుల్ ఔషదం. కరక్కాయ లోంచి గింజలు తీసివేసి మెత్తగా దంచి 100 గ్రాముల పొడికి 60 గ్రాముల సైందవ లవణాన్ని తోడేసి మజ్జిగలో కలిపి తీసుకుంటే వాతం నొప్పులు తగ్గుతాయి.  త్రిఫల చూర్ణాన్ని గర్బినులు, ఉపవాసం ఉన్నవారు, పిత్త దోషగుణం ఉన్నవారు తీసుకోరాదు.

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు