ప్రతి సంవత్సరం డిసెంబర్ 1న వరల్డ్ ఎయిడ్స్ డే జరుపుకుంటారు. ఈ రోజు HIV / AIDS గురించి అవగాహన పెంచడానికి, బాధితులకు మద్దతు ఇవ్వడానికి ప్రపంచం మొత్తం కలిసి చర్యలు తీసుకుంటుంది.
“Overcoming Disruption, Transforming the AIDS Response” అంటే, గత కొంతకాలం వచ్చిన అడ్డంకులను (మహమ్మారి, నిధుల తగ్గింపు, ఆరోగ్య సేవల లోపం) దాటుకుని AIDSపై పోరాడడాన్ని మళ్లీ బలంగా మొదలు పెట్టాలి అనేది ఈ 2025 లో ఎయిడ్స్ డే నినాదం.

కోవిడ్ తర్వాత చాలా దేశాల్లో HIV పరీక్షలు, చికిత్సలు, మందులు ఇచ్చే పనులు తగ్గాయి.
దాంతో కొంత మంది రోగులు సమస్యలు ఎదుర్కొన్నారు.
“మళ్లీ ఈ కార్యక్రమాన్ని బలంగా మొదలు పెట్టాలి, ఎయిడ్స్‌ను పూర్తిగా ఆపాలి” అని ఇప్పుడు ప్రపంచం కోరుకుంటోంది.
లక్షల మంది ఇంకా HIV తో జీవిస్తున్నారు. కానీ చికిత్స (ART) వల్ల చాలా మంది ఆరోగ్యంగా జీవిస్తున్నారు. దీనికి సరైన సమాచారం, అవగాహన చాలా అవసరం, ఎలాంటి భయాలు, అపోహలు అయినా తొలగించాలి.
మనం కూడా HIV టెస్ట్ చేయించుకోవాలి, రూమర్లు నమ్మకూడదు, సరైన చికిత్స & మందులు తీసుకోవాలి, HIV ఉన్నవారిని దూరంగా పెట్టకూడదు, ఈరోజు ఒక్కరోజు ఎరుపు రిబ్బన్ ధరించండి, ఎలాంటి వివక్ష చూపించకండి, HIV ఉన్న వాళ్ళకు మద్దతు చాలా ముఖ్యం.
HIV కారణంగా శరీరం బలహీనపడవచ్చు కానీ సమాజం వల్ల వచ్చే బాధ ఇంకా ఎక్కువ.
మనమందరం కలిసి ఉంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, భయం తగ్గుతుంది, చికిత్స పొందడానికి ధైర్యం కలుగుతుంది
2025 World AIDS Day మనకు ఒక సందేశం ఇస్తోంది “మనము ఒకరికి ఒకరు మద్దతు ఇస్తేనే, ఎయిడ్స్‌కు ముగింపు కనిపిస్తుంది.” 2030 నాటికి AIDS ను పూర్తిగా ఆపడం లక్ష్యం.
మనమందరం ఒక చిన్న అడుగు వేయాలి, అవగాహన పంచుకుందాం, మద్దతు ఇచ్చుకుందాం.
