Munagaku Benefits In Telugu: మునగ ఆకు వలన ఉపయోగాలు

Munagaku Benefits In Telugu: మునగాకు వళ్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో ఈ ఆకుకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. మునగకాయలు, మునగపువ్వులు రెండూ మన శరీరానికి, ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం.

Munagaku Benefits In Telugu

  • వేసవి కాలంలో మునగకాయలు, పచ్చి మామిడి కాయలు కలిపి వండిన కూర తినడం ద్వారా శరీరానికి చలవ చేకూర్చడమే కాకుండా ఐరన్, విటమిన్ సి లాంటి పోషకాలు కూడా లభిస్తాియి.
  • మునగ పువ్వులను పాలలోపోసి కాగబెట్టి తాగితే తాత్కాలికంగా నపుంసకత్వం తగ్గుతుంది.
  • ఒక స్పూను మునగపువ్వు రసాన్ని గ్లాసెడు మజ్జిగలో వేసుకొని తాగితే ఉబ్బసానికి, అజీర్తికి మంచి ఔషధముగా పనిచేస్తుంది.
  • ముత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నవారు, లేత కొబ్బరి నీళ్లీలో ఓ స్పూను మునగపువ్వు రసాన్ని కలిపి తాగితే మంచి ఫలితాలను ఇస్తుంది.
  • ఓ కప్పు మునగాకు రసాన్ని బాగా వేడిచేసి, పైనీరు తీసేసి దాంట్లో పాలు పోసి గర్భినీ స్త్రీలకు అందిస్తే పిండం మంచిగా పెరగడమే కాక, ప్రసవము కూడా చాలా సుఖంగా జరుగుతుంది.
  • బాగా మరిగించిన ఒక చెంచా మునగాకు రసాన్ని చల్లార్చి, క్యారెట్ జ్యూస్ లో కలిపి తీసుకుంటే మలబద్దకం తగ్గి, మూత్రపిండాల వ్యాధులు కూడా తగ్గుతాయి.
  • ఒక చెంచా మునగాకు రసములో కొద్దిగా తేనె కలిపి తాగితే రేచీకటి తగ్గుతుంది, జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. ఇందులో కొంచెం నిమ్మరసం కలిపి తీసుకుంటే తలతిరుగుడు, మొలలు, ఎక్కిళ్లు, అజీర్ణం లాంటివి తగ్గుతాయి.
  • మునగాకు రసములో నువ్వుల నూనె కలిపి బాగా కచి, నీరు మొత్తం ఇంకిన తర్వాత ఉన్న మిశ్రమాన్ని గజ్జి, దురదవంటి వాటి పై పూస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయి.
  • మునగాకు రసములో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుంటే ముఖంపైనున్న మొటిమలు తగ్గిపోతాయి. ఒక స్పూను మునగాకు రసములో 3 మిరియాలు పొడిచేసి కలిపి కణతలపై రాసుకుంటే తలనొప్పి తగ్గుతుంది.

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు