Tulasi health benefits: తులసి ఆరోగ్య ప్రయోజనాలు..

Basil leaves benefits: హిందువులు తులసి మొక్కను ఎంతో పవిత్రంగా పూజిస్తారు. తులసి పూజనీయమైనదే కాదు.. లెక్కలేనన్ని ఔషధ గుణాలు కూడా దీనిలో ఉన్నాయి. ఈ తుల‌సి ఆకుల‌ను ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి మేలే చేస్తాయి. గొంతునొప్పి, నోటి దుర్వాస‌న‌, కఫం, దగ్గు లాంటి ఎన్నో స‌మ‌స్య‌లకు తుల‌సి మొక్క అద్బుతమైన పరిష్కారం చూపిస్తుంది. మన పెరట్లోని తులసి చెట్టు ఇచ్చే ఔషధ గుణాల గురించి ఓ సారి తెలుసుకుందాం..

www.indiamart.com
Source: www.indiamart.com

తులసి ఆరోగ్య ప్రయోజనాలు

 • కఫం పడుతున్న వ్యాధులపై తులసి అద్భుతంగా పనిచేస్తుంది. రక్తంతో కూడిన దగ్గు, కఫం పడుతున్నప్పుడు తులసి ఆకులు  నాలుగు చొప్పున ప్రతి గంటగంటకూ తింటే దగ్గు, ఇతర సమస్యలు తగ్గుముఖం పడతాయి. కడుపులోని క్రిములను పారదోలే శక్తి తులసికి ఉంది. తులసిని వాడితే క్రిములు తొలగడమే కాక రక్తహీనత కూడా నివారించబడుతుంది.
 • జీర్ణ శక్తికి తులసి చాలా మంచి మందు. తులసి ఆకులు నాలుగు, మిరియాలు రెండు వేసి మెత్తగా నూరి చిన్న మాత్రగా చేసుకుని భోజనానికి అరగంట ముందుగా వేసుకుంటే బాగా ఆకలి వేస్తుంది. తిన్నది కూడా జీర్ణమవుతుంది. ముఖ్యంగా 7, 8 ఏళ్ల పైబడిన చిన్న పిల్లలకు రోజూ ఉదయం నాలుగు తులసి ఆకులు తినిపిస్తే జీర్ణక్రియ సాఫీగా జరిగి ఆకలి బాగా వేస్తుంది.
 • కొన్ని తులసి ఆకులను రాత్రి నీటిలో నానబెట్టి ఆ నీటితో ఉదయం పళ్ళు తోముకుంటే నోటి దుర్వాసన, నోటిపొక్కులు తగ్గుతాయి.
 • ఉదయాన్నే తులసి ఆకులను పిడికెడు దంచి కషాయంగా కాచి కానీ, లేదా ఆ రసం లో ఒక చెంచా తేనె చేర్చి కానీ తాగితే కఫం తగ్గుతుంది.
 • తులసి ఆకుల రసంలో తేనెని కలిపి రోజుకి రెండు సార్లు చొప్పున తీసుకుంటే దగ్గు, జలుబు తగ్గుతాయి.
 • జలుబు, దగ్గుతో బాధపడే వారు ఒక టీ స్పూను శొంఠి, ఒక టీ స్పూను మిరియాల పొడి, అయిదు నుంచి పది తులసి ఆకులు వేసి మరిగించిన కషాయాన్ని తాగితే ఫలితం ఉంటుంది.
 • తులసి ఆకుల రసానికి శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచే గుణం ఉంది. తులసి ఆకులు, పుదీనా ఆకులు కలిపి కషాయంగా కాచి తాగితే రోజు వారీ వచ్చే జ్వరం తగ్గుతుంది.
 • తులసి రసం, ఉల్లిపాయరసం, అల్లం రసం, తేనె కలిపి ఆరు చెంచాలు రెండుపూటలా తాగితే విరేచనాలు, రక్తవిరేచనాలు అరికడుతుంది.
 • తులసి శరీరంలో ఉండే అధిక కొవ్వును నివారిస్తుంది., తులసి ఆకులను మజ్జిగతో కలిపి సేవిస్తే బరువు తగ్గుతారు.

నేత్ర సంబంధ ఆరోగ్య ప్రయోజనాలు

 • కళ్ళు మంటలు, కళ్ళవెంట నీరు కారడంలాంటి సమస్యలతో బాధపడేవారు తులసి ఆకుల రసాన్ని కంట్లో పడకుండా దూదితో కను రెప్పల మీద రాసి చూడండి.
 • నిద్రలేమితో బాధపడేవారికి తులసి గొప్ప ఔషధం. అడవి తులసి రసాన్ని పంచదారతో కలిపి ప్రతిరోజూ రాత్రి పడుకోబోయే ముందు రెండు చెంచాలు తాగితే చక్కగా నిద్రపడుతుంది.

నోరు, గొంతు సంబంధ ఆరోగ్య ప్రయోజనాలు

 • గొంతు నొప్పి కూడా చాలా మందిలో భ‌రించ‌రాని స‌మ‌స్య‌గా ఉంటుంది. ఈ స‌మ‌స్య ఉన్న‌వాళ్లు నీళ్ల‌లో తుల‌సి ఆకులు వేసి బాగా మ‌రిగించాలి. ఆ త‌ర్వాత ఆ నీళ్లు గోరువెచ్చ‌గా మార‌గ‌నే తాగాలి. దాంతో గొంతునొప్పి మ‌టుమాయం అవుతుంది.
 • తులసి రసాన్ని తేనెతో కలిపి ఒక స్పూను ప్రతిరోజూ తాగితే నోటి పూత, గొంతునొప్పి, బొంగురుపోయిన గొంతు సాఫీగా ఉంటుంది.

చర్మ సంబంధ ఆరోగ్య ప్రయోజనాలు

 • తులసి రసంలో కొద్దిగా నిమ్మరసాన్ని కలిపి, ఈ మిశ్రమాన్ని ముఖం లేక శరీరం మీద నల్ల మచ్చలు న్న ప్రాంతంలో రాసుకోవాలి. ఆరిన తరువాత నీటితో కడుగుతూ ఉండాలి. ఇలా ప్రతి రోజుకు మూడు సార్లు చొప్పున గాని; రెండు పూటలా చేస్తున్నాగాని నల్ల మచ్చలు పోయి శరీరం తేజోవంతం అవుతుంది.
 • ఒక టీ స్పూన్ తులసి ఆకుల రసంలో, అరస్పూన్ తేనె కలిపి, కొద్దిగా మంచినీరు జోడించి ప్రతిరోజూ ఉదయం తాగితే జీర్ణక్రియ సరిదిద్దడమే కాక, చర్మానికి మంచి మెరుపు కూడా వస్తుంది.
 • అడవి తులసి ఆకుల రసంలో ఎన్నో ఔషధీయ గుణాలు కలిగి ఉన్నాయి. దీని రసాన్ని కంటి క్రింద పూస్తూ ఉంటే, కళ్ళ క్రింద వచ్చే ఉబ్బు – నల్లటి వలయాలు అరికట్టబడతాయి.
 • ఇంకా తుల‌సి ర‌సంలో తేనె క‌లిపి తీసుకుంటే కూడా మంచి ప్ర‌యోజ‌నం ఉంటుంది. ఈ రెండింటిలోనూ యాంటీ సెప్టిక్ గుణాలు ఉండ‌టంవ‌ల్ల చ‌ర్మ స‌మ‌స్య‌లు ద‌రిచేర‌వు. సాధార‌ణ జ‌లుబు, ద‌గ్గు కూడా త‌గ్గుతాయి. నోటిపూత‌కు కూడా ఇది మంచి ఔష‌ధంగా ప‌నిచేస్తుంది.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు