Beast Movie Review: బీస్ట్ తెలుగు మూవీ రివ్యూ

Beast Movie Review: బీస్ట్, సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం, దళపతి విజయ్ నటించిన ఈ చిత్రం ఈరోజు థియేటర్ లో అంటే ఏప్రిల్ 13 న రిలీజ్ అయ్యి, అందరి మనసులు దోచుకుంటుంది. విజయ్ కి తెలుగు మంచి క్రేజ్ ఉంది, కానీ చాలా సినిమాలు తెలుగు లో రిలీజ్ చేయలేదు, అయితే తన గత చిత్రం మాస్టర్ తెలుగు లో విడుదల చేసి భారీ హిట్ కొట్టాడు, ఆ ధైర్యం తోనే బీస్ట్ నిర్మాతలు తెలుగు లో చాల గ్రాండ్ గా ఈ చిత్రాన్ని విడుదల చేసారు. థియేటర్ లో ఈ చిత్రం మంచి టాక్ ని సొంతం చేసుకుంది, బీస్ట్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తన గత చిత్రం డాక్టర్ తెలుగు గణ విజయం సాధించిన తరువాత అతను కూడా తెలుగు ప్రేక్షకులకు మంచి సుపరిచితుడు అయ్యాడు, అయితే డాక్టర్ మ్యాజిక్ వర్కవుట్ అయ్యిందా, ఈ చిత్రం చూడదగినదా కాదా ఈ రివ్యూ లో చూద్దాం.

Beast Telugu Movie Review

కథ

వీర రాఘవ(విజయ్) ఒక secret ఏజెంట్,ఒక సీక్రెట్ మిషన్ నిమిత్తము తను హైదరాబాద్ వస్తాడు.మిషన్ లో భాగంగా ఒక షాపింగ్ మాల్ కి వెళ్తాడు, అయితే అక్కడ అనుకోకుండా షాపింగ్ మాల్ ని టెర్రరిస్టులు హైజాక్ చేస్తారు. టెర్రరిస్టులు తమ డిమాండ్స్ తీర్చాలని ప్రభుత్వం తో చర్చలు మొదలుపెడ్తారు.ఈలోగ ప్రభుత్వానికి షాపింగ్ మాల్ లో ఒక సీక్రెట్ ఏజెంట్ ఉన్నాడని తెలియడం తో, వెంటనే ఒక సీక్రెట్ రిస్క్యూ ఆపరేషన్ ని మొదలుపెడతారు. చివరికి వీర రాఘవ అక్కడ ఉన్నవాళ్లందరిని ఎలా కాపాడాడు, అసలు టెర్రరిస్టుల డిమాండ్స్ ఏంటి అనేది మిగతా కథ.

బీస్ట్ మూవీ నటీనటులు

విజయ్, పూజ హెగ్డే, సెల్వ రాఘవన్, యోగి బాబు, అపర్ణ దాస్ మరియు తదితరులు నటించగా, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు,మనోజ్ పరమహంస ఛాయాగ్రహణం అందించగా, అనిరుద్ రవిచంద్రన్ సంగీతం సమకూర్చారు, సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

సినిమా పేరుబీస్ట్
దర్శకుడునెల్సన్ దిలీప్ కుమార్
నటీనటులువిజయ్, పూజ హెగ్డే, సెల్వ రాఘవన్, యోగి బాబు, అపర్ణ దాస్ మరియు తదితరులు
నిర్మాతలుసన్ పిక్చర్స్
సంగీతంఅనిరుద్ రవిచంద్రన్
సినిమాటోగ్రఫీమనోజ్ పరమహంస
ఓటీటీ రిలీజ్ డేట్ఇంకా ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ఇంకా ధ్రువీకరించలేదు

బీస్ట్ సినిమా ఎలా ఉందంటే?

దళపతి విజయ్ సినిమా వస్తుంది అంటే, తమిళనాడు లొ విజయ్ ఫాన్స్ కి ఒక పెద్ద పండగే, మాస్టర్ తో పెద్ద హిట్ కొట్టిన విజయ్ నెక్స్ట్ ఏ మూవీ తో వస్తున్నాడు అని చాలా ఆసక్తి తో ఎదురుచూసారు,నెల్సన్ దర్శకత్వం లో బీస్ట్ మూవీ అని తెలియగానే ఇంకా మూవీ మీద ఆశలు రెట్టింపయ్యాయి, ఎందుకంటే తెలుగు లో కూడా నెల్సన్ డాక్టర్ మూవీ తో పెద్ద హిట్ కొట్టాడు.
అయితే బీస్ట్ కథ పరంగా అంత గొప్ప కథ అయితే కాదు, కాని బీస్ట్ బాగుండడానికి ముఖ్య కారణం స్క్రీన్ ప్లే అనే చెప్పాలి.అయితే షాపింగ్ మాల్ లో యోగిబాబు వచ్చే కామెడీ సన్నివేశాలు కొంతమేరకు ప్రేక్షకులని నవ్విస్తుంది, అయితే డాక్టర్ లో ఉన్నంత కామెడీ ఉంటుందని వెళ్లిన వారికీ కొంత నిరాశ కలిగే అవకాశమైతే ఉంది.
ఇక వీర రాఘవ గ విజయ్ బాగా చేసాడు, అయితే ఇలాంటి పాత్రలు ఆయనికి కొత్హెం కాదు అందువల్ల విజయ్ అద్భుతంగా చేసాడని చెప్పలేం,పూజ హెగ్డే పాత్రకి అసలు ఎలాంటి స్కోప్ లేదు, ఇక యోగి బాబు ఇతర కామెడీ ఆర్టిస్ట్ లు వాళ్ళ పాత్రలకి న్యాయం చేసారు.
దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కి కథల పట్ల చక్కటి అవగాహనా ఉందని మల్లి ఈ మూవీ తో నిరూపించుకున్నాడు, బీస్ట్ మూవీ ని చాలా బాగా హ్యాండిల్ చేసాడని చెప్పొచ్చు, అయితే నెల్సన్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే, తను సీరియస్ గ ఉన్న కథలను తీస్కొని తన మార్క్ కామెడీ తో సినిమాని నడిపించే విధానం, బీస్ట్ కూడా అదే అమలు చేసాడు. అయితే బీస్ట్ లో మంచి కామెడీ ఉంది కానీ డాక్టర్ లో ఉన్నంత కామెడీ అయితే ఉండదు. కాకపోతే ఈసారి తాను ఎంచుకున్న బ్యాక్ డ్రాప్ చాలా బాగుంది.
ఇక మనోజ్ పరమహంస అద్భుతమైన విజుఅల్స్ అందించాడు, ఇక అనిరుద్ సంగీతం ఎప్పుడు సినిమాకి వెన్నెముక్కగా నిలుస్తుంది, ఈ మూవీ లో చాల సన్నివేశాలు తన సంగీతం తో వేరే లెవెల్ కి తీసుకెళ్లాడు.
చివరగా, బీస్ట్ ఒక్కసారి చూడొచ్చు, ఒకవేళ మీరు విజయ్ ఫ్యాన్ అయితేగనక తప్పకుండ చూడాల్సిన చిత్రం.

సినిమా రేటింగ్: 2.5/5

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు