Masooda Movie Telugu Review:చాలా తక్కువ మంది నిర్మాతలు చిత్రాలను జడ్జ్ చేయడంలో మంచి అభిరుచిని కలిగి ఉంటారు మరియు మళ్ళిరావా మరియు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ వంటి చిత్రాలను నిర్మించిన రాహుల్ యాదవ్ నక్క అభిరుచి గల నిర్మాతలలో ఒకరు మరియు ‘మసూదా’ అనే హారర్ జానర్ లాంటి మరో ప్రత్యేకమైన చిత్రంతో ముందుకు వచ్చారు. హారర్ చిత్రానికి కాలం చెల్లిన రోజులివి కానీ ఇప్పుడు హారర్ చిత్రంతొ రావాలంటే చాలా ధైర్యం కావాలి అయితే టీజర్ మరియు ట్రైలర్ ప్రత్యేకంగా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించాయి మరియు మసూద సాధారణ హారర్ చిత్రం కాదని అనిపిస్తుంది, అయితే చివరకు సినిమా విడుదలైంది మరియు సినిమా చూడదగినదేనా అని ఈ రివ్యూ లొ తెలుసుకుందాం .
కథ
మసూదా కథ ఒక 17 ఏళ్ల నాజియా అనే అమ్మాయి తన ఆమె విచిత్ర ప్రవర్తన వల్ల తల్లి సంగీత తన పొరుగువారు అయిన గోపి (తిరువీర్) సహాయం కోరుతుంది, అయితే స్వతహాగా భయస్తుడు అయిన గోపి తనకి సహాయం చేయాలని నిర్ణయించుకుని ‘పీర్ బాబా’ దగ్గరికి తీసుకుకెళ్తారు కానీ చివరికి ఆమె ప్రవర్తన రెట్టింపు అవుతుంది మరియు గోపి మరియు ఆమె తల్లి ఆమెతో సమస్యలను ఎదుర్కోవడం ప్రారంభిస్తారు, అయినప్పటికీ, ఆమె వింత ప్రవర్తనతో చాలా ప్రశ్నలకు సమాధానాలు లేకుండా ఉంటాయి అయితే ఒకరోజు విచారణలో మసూదా అనే అమ్మాయి గురించి తెలుస్తుంది, ఇంతకీ ఎవరు మసూదా? ఆమె బ్యాక్ స్టోరీ ఏమిటి అనేది సినిమా యొక్క ప్రధానాంశం.
మసూదా మూవీ నటీనటులు
సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, శుభలేక సుధాకర్, అఖిలా రామ్, బాండవి శ్రీధర్, సత్యం రాజేష్, సత్య ప్రకాష్, సూర్యారావు, సురభి ప్రభావతి, కృష్ణ తేజ, సాయి కిరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ నగేష్ బానెల్ సంగీతం ప్రశాంత్ ఆర్ విహారి ఈ చిత్రానికి ఎడిటింగ్ జెస్విన్ ప్రభు మరియు స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి బ్యానర్‌పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు.
సినిమా పేరు | మసూదా |
దర్శకుడు | సాయి కిరణ్ |
నటీనటులు | సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, శుభలేక సుధాకర్, అఖిలా రామ్, బాండవి శ్రీధర్, సత్యం రాజేష్, సత్య ప్రకాష్, సూర్యారావు, సురభి ప్రభావతి, కృష్ణ తేజ |
నిర్మాతలు | రాహుల్ యాదవ్ నక్కా |
సంగీతం | ప్రశాంత్ ఆర్ విహారి |
సినిమాటోగ్రఫీ | నగేష్ బానెల్ |
ఓటీటీ రిలీజ్ డేట్ | ధ్రువీకరించలేదు |
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ | ధ్రువీకరించలేదు |
మసూదా సినిమా ఎలా ఉందంటే?
హారర్ జానర్ చాలా ఆసక్తికరమైన మరియు ఉత్తేజకరమైన జానర్‌లలో ఒకటి, కానీ అది ఇప్పుడు కనుమరుగైంది, ప్రేక్షకులు కొత్త కథలని ఇష్టపడే టైంలో మళ్లీ ఈ హారర్ జానర్‌తో రావడం అంత సులభం కాదు, మేకర్స్ ఆకర్షణీయమైన కథను అందించకపోతే, ప్రేక్షకులు నిర్దాక్షిణ్యంగా సినిమాని ఫ్లాప్ చేస్తారు. కానీ మసూద ఖచ్చితంగా మాములు హారర్ కథ అయితే కాదు, సినిమా మొదట్లో రెగ్యులర్‌గా కనిపిస్తుంది, కానీ నెమ్మదిగా ఆవరణ మిమ్మల్ని మసూద ప్రపంచంలోకి లాగుతుంది మరియు కథతో ప్రయాణించేలా చేస్తుంది, అయితే అసలైన కథలోకి వెళ్లడానికి సమయం పడుతుంది కానీ సినిమా మూడ్ మీకు ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తుంది.
మొదటి సగం ఆసక్తికరమైన డ్రామాతో సాగిన ఎప్పుడైతే గోపి మరియు సంగీత మెడికేషన్ మరియు పీర్ బాబా రెండింటితో నజియా పరిస్థితిని నయం చేయడానికి ప్రయత్నించినప్పుడు, ఆ సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి మరియు మొదటి సగం లొ సస్పెన్స్ ప్రేక్షకుల దృష్టిని హోల్డ్ చేసి తరువాత సగం చూడాలనే ఉత్సుకతను సృష్టించింది. అన్ని లయెర్స్ ని ఒక్కోటిగా విపుతున్నప్పుడు రెండవ భాగం ఆసక్తికరంగా మొదలవుతుంది మరియు ట్విస్ట్‌లను ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ సినిమాని ఆసక్తికరంగా మరియు సీట్‌కి అతుక్కుపోయేలా చేస్తుంది, సెకండాఫ్ యొక్క రేసీ స్క్రీన్‌ప్లే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది మరియు క్లైమాక్స్ కూడా నమ్మదగినదిగా అమలు చేయబడింది.
సైన్స్ టీచర్‌గా మరియు అమాయక తల్లిగా సంగీత అద్భుతంగా చేసింది, చాలా గ్యాప్ తర్వాత ఆమెకు మంచి పాత్ర వచ్చింది, గోపిగా తిరువీర్ ఎప్పటిలాగే కూల్‌గా కనిపించాడు, అతని అమాయకమైన నటన ఆ పాత్రను నమ్మేలా చేస్తుంది, కావ్య కళ్యాణ్ రామ్ ఆమె పాత్రకు ఏ మాత్రం స్కోప్ లేదు మరియు మిగిలిన నటీనటులు బాగా చేసారు.
సాయి కిరణ్ ఒక ప్రత్యేకమైన హారర్ చిత్రాన్ని అందించడానికి ప్రయత్నించాడు మరియు అతను అత్యుత్తమ హారర్ థ్రిల్లర్‌ను అందించడంలో విజయం సాధించాడు కూడా.
టెక్నికల్‌గా, మసూద చాలా అద్భుతంగా ఉంది , తక్కువ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించినప్పటికీ, నాగేష్ బానెల్ సినిమాటోగ్రఫీ సినిమాను ప్రతి ఫ్రేమ్‌లో రిచ్‌గా చూపించింది, ప్రశాంత్ ఆర్ విహారి విభిన్నఇంస్ట్రుమెంట్సతో అద్భుతమైన సంగీతాన్ని అందించడంలో విజయవంతమయ్యారు.
ఓవరాల్‌గా చెప్పాలంటే, ఇటీవలి కాలంలో వచ్చిన అత్యుత్తమ హారర్ చిత్రాలలో మసూద ఒకటి.
ప్లస్ పాయింట్లు:
- కథ
- స్క్రీన్ ప్లే
- బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
- సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్లు:
- కథ
- స్క్రీన్ ప్లే
- సంగీతం
- ఎమోషన్ లేకపోవడం
సినిమా రేటింగ్: 2.5/5
ఇవి కూడా చుడండి: