నాన్-ఫంజిబుల్ టోకెన్: స్కూల్ సెలవుల్లో తిమింగలం బొమ్మలు సృష్టించి రూ.3 కోట్లు సంపాదించాడు – voiceofandhra.net

బెన్యమిన్ అహ్మద్ అనే 12 సంవత్సరాల పిల్లాడు స్కూల్ సెలవుల్లో దాదాపు 2,90,000 పౌండ్లు అంటే రూ.2,93,27,236 సంపాదించాడు.

లండన్‌లో ఉండే బెన్యమిన్.. కంప్యూటర్‌లో వియర్డ్ వేల్స్ అనే ఆర్ట్‌వర్క్స్ సృష్టించాడు. వాటిని నాన్‌ ఫంజిబుల్ టోకెన్స్‌ (ఎన్ఎఫ్‌టీ)గా విక్రయించి కోటీశ్వరుడు అయిపోయాడు. ‘వియర్డ్ వేల్స్’ డిజైన్ బెన్యమిన్ రెండో డిజిటల్ ఆర్ట్ కలెక్షన్. అంతకుముందు అతడు మైన్‌క్రాఫ్ట్ స్పూర్తితో రూపొందించిన డిజిటల్ సెట్ కాస్త తక్కువకు అమ్ముడయ్యింది. ఈసారి బెన్యమిన్ ఒక పాపులర్ పిక్సిలేటెడ్ తిమింగలాల మీమ్ ఇమేజ్, పాపులర్ ఆర్ట్ స్టైల్ తీసుకుని వియర్డ్ వేల్స్ తయారు చేశాడు.

కానీ ఎమోజీల్లా కనిపించే 3,350 రకాల తిమింగలాల సెట్‌ను సృష్టించడానికి అతడు తన సొంత ప్రోగ్రాంను ఉపయోగించాడు. “ఆ తిమింగలాలన్నీ ఏర్పడుతుంటే, నా స్క్రీన్ మీద అవి మెల్లమెల్లగా జనరేట్ అవుతుంటే చూడ్డం చాలా ఆసక్తిగా ఉంటుంది” అన్నాడు బెన్యమిన్. బెన్యమిన్ అహ్మద్ ఈ ఆర్ట్‌వర్క్‌లు అమ్మి సంపాదించిన డబ్బును ఎథేరియం క్రిప్టో కరెన్సీ రూపంలో దాచుకున్నారు. అంటే ఈ క్రిప్టో కరెన్సీ విలువ పెరగచ్చు లేదా తగ్గచ్చు. ఆ మొత్తం ఉన్న డిజిటల్ వాలెట్ హ్యాక్ అయినా, వేరే ఏదైనా అయినా అధికారుల నుంచి ఎలాంటి బ్యాకప్ ఉండదు.

ఎన్ఎఫ్‌టీలతో ఏదైనా డిజిటల్ కళాకృతిని ‘టోకనైజ్’ చేయవచ్చు. అంటే దాని క్రయ విక్రయాలకు డిజిటల్ రూపంలో ఓన‌ర్‌షిప్ సర్టిఫికేట్‌ను తయారు చేయడం అన్నమాట. అయితే, కొనుగోలు చేసిన వారికి కళాకృతులను నిజంగా ఇవ్వరు. వాటి కాపీ రైట్ కూడా కొనుగోలు చేసిన వారికి ఇవ్వరు. వైరల్ వీడియో వెర్షన్లను, మీమ్‌లను, ట్వీట్‌లను కూడా ఎన్ఎఫ్‌టీ కళారూపాల్లా అమ్ముకోవచ్చు. బెంజమిన్ తన హాబీ గురించి ఎన్నో యూట్యూబ్ వీడియోలు చేశాడు. కానీ ఇప్పుడు వచ్చిన క్రిప్టో సంపద గురించి తన క్లాస్‌మేట్స్‌కు ఇంకా తెలీదు. ఎన్‌ఎఫ్‌టీ క్రియేట్ చేయడంతోపాటూ బెన్యమిన్‌కు స్విమ్మింగ్, బాడ్మింటన్, టైక్వాంటో అంటే కూడా ఇష్టమే. “ఇందులోకి రావాలనుకునే పిల్లలకు నేనిచ్చే సలహా ఒకటే. మీ అంతట మీరో, మీ తల్లిదండ్రుల ఒత్తిడితోనో బలవంతంగా కోడింగ్‌లోకి రావద్దు. అంటే మీకు వంట ఇష్టమైతే వంట, డాన్స్ ఇష్టమైతే డాన్స్ అలా మీకు నచ్చిన దానినే చేయండి” అని బెన్యమిన్ అంటున్నాడు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు