Independence Day Wishes 2023, Images, Quotes, GIF, Greetings, Messages, Status: ఎంతో మంది ప్రాణాలకు తెగించి బ్రిటిష్ వారిని ఎదుర్కొని, కొన్ని వేల మంది ప్రాణాలు అర్పిస్తే గాని మనకి స్వాతంత్య్రం రాలేదనే విషయం తెలిసిందే. ఇక ప్రతి సంవత్సరం ఈ స్వాతంత్య్ర దినోత్సవాన్ని మన భారతీయులు ఒక పండగలగా జరుపుకుంటారు. ఇక ఈసారి 77 స్వాతంత్య్ర దినోత్సవం అంగరంగ వైభవంగా జరపడానికి పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తూ ఉంటారు.
పాఠశాలలో, కాలేజీలో, ఆఫీసులో జెండా ని ఎగరవేసి పండగల జరుపుకుంటారు, అయితే ఇప్పుడున్న టెక్నాలజీ తో, ప్రజలు ఫోన్ లో ఎక్కువగా గడుపుతూ ఉంటారు. ఇక స్వాతంత్య్ర దినోత్సవ సందర్బంగా ప్రతి ఒక్కరు, ఇండిపెండెన్స్ డే విషెస్ కోసం, మెసేజెస్ కోసం, కోట్స్, వాట్సాప్ స్టేటస్ విషెస్ కోసం ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తూనే ఉంటారు. ఇక మీ పని సులభం చేసుకోడానికి, ప్రతిదీ కింద పొందుపరిచాము. ఒకసారి చెక్ చేయండి.
హ్యాపీ ఇండిపెండెన్స్ డే విషస్, కోట్స్, మెసెజస్, ఇమేజస్, స్టేటస్ ( Independence Day Wishes, Quotes, Messages, Status, Images)
“వందేమాతరం..భారతీయతే మా నినాదం..స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.””మన దేశాన్ని అత్యుత్తమంగా మారుద్దాం. శాంతికి, దయకు మారుపేరుగా నిలుపుదాం. మీకు, మీ కుటుంబ సభ్యులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ”
“నేటి మన స్వతంత్ర సంబరం ఎందరో వీరుల త్యాగం. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.”
“స్వేచ్ఛకు ఉన్న నిజమైన అర్థమేంటో తెలుసుకుందాం. మిత్రులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.”
“స్వేచ్ఛ ఇవ్వబడలేదు, తీసుకోబడింది.”
స్వేచ్ఛ లేని రోజును మీరు ఊహించగలరా? అది మన ఉనికిలో అంతర్భాగం. అందరం స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుందాం.
స్వేచ్ఛ రంగులు లేదా ఆకారాలను చూడదు. ప్రపంచంలో తగినంత ద్వేషం, హింస ఉంది. ఇప్పుడు మనం ప్రేమ, ఐక్యత, అవగాహనతో కూడిన మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలి. స్వాతంత్య్ర దినోత్సవాన్ని అద్భుతంగా జరుపుకుందాం.
స్వేచ్ఛ, స్వాతంత్య్రం లేని జీవితం కంటే నరకం మేలు. మన అదృష్టం కొద్దీ మనకు అవి దక్కాయి. సమరయోధులను స్మరించుకుంటూ ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకుందాం.
మన పూర్వీకులు తమ కష్టాలు, త్యాగాలతో మనకు స్వాతంత్య్రాన్ని సంపాదించారు. ఇప్పుడు మనం రాబోయే తరాలకు మెరుగైన దేశాన్ని సృష్టించేందుకు కృషి చేయాలి. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
హ్యాపీ ఇండిపెండెన్స్ డే కోట్స్ ( Independence Day Wishes Quotes)
మన దేశం ఈ రోజును జరుపుకోవడానికి వేల మంది తమ ప్రాణాలను అర్పించారు. వారి త్యాగాలను ఎప్పటికీ మరువవద్దు. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
స్వరాజ్యం మన జన్మ హక్కు. మనల్ని మనం పాలించుకుంటున్నాం. మన స్వేచ్ఛను ఎవరూ హరించలేరు. మనది మహోన్నత దేశం. స్వాతంత్య్రాన్ని తెచ్చిపెట్టిన మహనీయులకు వందనాలు తెలుపుతూ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
నెత్తుటి చుక్క రాలకుండా స్వాతంత్య్ర సాధించడం భారతీయులకే చెల్లింది. సమరయోధుల త్యాగనిరతిని కీర్తిస్తూ… స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందాం.
స్వేచ్ఛ మనతో ఉంది. దేశభక్తి అణువణువూ నిండివుంది. భారతీయులు సగర్వంగా తలెత్తుకునే రోజుకి స్వాగతం చెబుతూ… అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
గతం త్యాగాలమయం.. వర్తమానం కృషీప్రయాణం.. భవిష్యత్తు బంగారు బాటల నిలయం కావాలని కోరుకుంటూ అందరికీ ఇండిపెండెన్స్ డే విషెస్.
భారతీయులుగా పుట్టడం మన అదృష్టం. స్వేచ్ఛా వాయువులు మన సొంతం. మనకంటే స్వేచ్ఛ ఎవరికి ఉంది. ఆ స్వేచ్ఛను ఇచ్చిన సమరయోధులకు ధన్యవాదాలతో అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
హ్యాపీ ఇండిపెండెన్స్ డే మెసెజెస్ ( Independence Day Messages)
మన పూర్వీకుల ధైర్యసాహసాలు మనకు ఆదర్శనీయం. వారు ఇచ్చిన స్వాతంత్ర్య బహుమతిని మనం అనుభవిస్తున్నాం. ఆగస్ట్ 15 సందర్భంగా మన జెండా రెపరెపలాడాలి. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం మన మాటల్ని నిలబెట్టుకుందాం. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ మహిమాన్వితమైన దేశానికి వందనం చేద్దాం
స్వేచ్ఛ అనేది డబ్బుతో కొనలేనిది. ఇది చాలా మంది ధైర్యవంతుల పోరాటాల ఫలితం. ఈ రోజే కాదు ఎప్పుడూ వారిని గౌరవిద్దాం. 2023 స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
మన దేశ స్వాతంత్య్రాన్ని జరుపుకోవడానికి ఉత్తమ మార్గం మనం దేశభక్తి కలిగిన పౌరులుగా ఉండటమే. అలాగే ఉందాం. అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఇమేజస్ ( Happy Independence Day Wishes Images)
హ్యాపీ ఇండిపెండెన్స్ డే స్టేటస్ ( Happy Independence Day Wishes Status)
మీరు ఒకవేళ బెస్ట్ ఇండిపెండెన్స్ డే విషెస్ స్టేటస్ గురించి వెతుకుకుతున్నారా. అయితే మీకు శ్రమ తగ్గించడానికి మేము బెస్ట్ ఇండిపెండెన్స్ డే విషెస్ స్టేటస్ కొన్ని కింద ఉంచాము. మీకు నచ్చినవాటిని సెలెక్ట్ చేసుకుని, మీ స్నేహితులకి, కుటుంబ సభ్యులకి, శ్రేయోభిలాషులకు పంపించండి.
పైన మేము బెస్ట్ ఇండిపెండెన్స్ డే విషెస్ విషస్, మెసెజస్, కోట్స్, ఇమేజస్, స్టేటస్లు మీ ముందు ఉంచాం, నచ్చిన వాటిని సెలక్ట్ చేసుకొని మీ కుటుంబ సభ్యులకి, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి.