ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పడిపోతున్నాయా… ఆహార నాణ్యతపై ఎవరికి ఫిర్యాదు చేయాలి?

లలిత ఒక కార్పొరేట్ ఉద్యోగి. ఆమె సాధారణంగా భోజనం బయట నుంచే ఆర్డర్ చేస్తారు. వీకెండ్‌లో మాత్రమే ఇంట్లోనే వంట చేసుకుంటారు.

“వారంలో కనీసం నాలుగుసార్లు ఫుడ్ ఆర్డర్ చేస్తాను. లాక్ డౌన్ కి ముందు ఆఫీసు దగ్గరగా ఉండే ఈటరీస్ కు వెళుతూ ఉండేదానిని. స్విగ్గీ, జొమాటో ద్వారా తరచుగా ఫుడ్ ఆర్డర్ చేస్తూ ఉంటాను” అని చెప్పారు. “కొన్ని కొన్ని రెస్టారెంట్లు ఇచ్చే ఆహారం బాగుంటుంది. కొన్నిసార్లు నాణ్యమైన ఫుడ్ లభించదు. అలాంటప్పుడు రివ్యూలు రాసి, ఇక పై ఆ రెస్టారంట్ నుంచి ఆర్డర్ పెట్టడం మానేస్తూ ఉంటాను” అని చెప్పారు.

రెస్టారెంట్లు, మెస్‌లు, చిన్న చిన్న హోటళ్లు అందించే ఆహార నాణ్యత పై నియంత్రణ విధించేదెవరు? నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా హోటళ్లు, రెస్టారెంట్లు ఆహారం అందించని పక్షంలో ఫుడ్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? ఏదైనా రెస్టారంట్‌కు వెళ్ళినప్పుడు లేదా ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు కానీ వారు తగిన నాణ్యతా ప్రమాణాలను పాటించడం లేదనిపిస్తే, వినియోగదారులెవరికి ఫిర్యాదు చేయాలి?

ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించాలనే ఉద్దేశ్యంతో ఫుడ్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా ప్రతీ ఏడాది దేశంలో వివిధ రాష్ట్రాల్లో పాటిస్తున్న ఆహార ప్రమాణాలను పరిశీలిస్తుంది. ఇందు కోసం రాష్ట్రాలను పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తుంది. ఫుడ్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా సెప్టెంబరులో 2020-21 సంవత్సరానికి 3వ ఫుడ్ సేఫ్టీ జాబితాను విడుదల చేసింది. తొలిసారిగా ఫుడ్ సేఫ్టీ జాబితాను 2018లో విడుదల చేసింది.

ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ 36 పాయింట్లతో 19వ స్థానంలో ఉంది. తెలంగాణ 49 పాయింట్లతో 10వ స్థానంలో ఉంది. మొత్తం 20 పెద్ద రాష్ట్రాలలో ఆంధ్ర ప్రదేశ్ 19వ స్థానంలో ఉంది. 2019-20 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ స్కోర్ 42.8 కాగా 2020-21 నాటికి 36కి పడిపోయింది. గుజరాత్ 72 పాయింట్లతో ప్రథమ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అంచనాల ప్రకారం రాష్ట్రంలో 8000 రెస్టారెంట్లు, హోటళ్లు ఉన్నాయి.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు