కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా క్లారిటీ: సంచార్ సాథీ యాప్ తప్పనిసరి కాదు

టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సంచార్ సాథీ (Sanchar Saathi) యాప్‌ గురించి పెద్ద క్లారిఫికేషన్ ఇచ్చారు. ఈ యాప్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది అని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు తప్పు అని ఆయన తెలిపారు.

సింధియా గారి మాటల్లో “Sanchar Saathi యాప్ పూర్తిగా ఐచ్చికం (optional). ఎవరైనా డౌన్‌లోడ్ చేయవచ్చు, కానీ ఇది తప్పనిసరి కాదు” అని చెప్పారు.

Sanchar Saathi App is Not Compulsory Confirms Telecom Minister Jyotiraditya Scindia

ఈ యాప్‌ను ప్రభుత్వం ఫోన్ సేఫ్టీ కోసం తయారు చేసింది. దీని ద్వారా: Lost or stolen phone ను ట్రాక్ చేసి బ్లాక్ చేయవచ్చు, ఫేక్, డూప్లికేట్ సిమ్ నంబర్లను గుర్తించవచ్చు, మోసపూరిత కాల్స్‌, మెసేజ్‌ల నుండి రక్షణ కూడా ఉంటుంది.

ఇటీవల సోషల్ మీడియాలో ఈ యాప్‌ను అందరూ తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేయాలని పోస్టులు వైరల్ అయ్యాయి. దీనిపై ప్రజలు డౌట్, టెన్షన్ పడడంతో మంత్రి ఈ వివరణ ఇచ్చారు.

ప్రభుత్వం ఈ యాప్ డౌన్‌లోడ్‌ చేయమని ఎవరినీ బలవంతం చేయదు. ఇది ఇష్టపడేవారు ఉపయోగించుకునే యాప్ మాత్రమే అని వివరించారు.

“ప్రజల ప్రైవసీ, డేటా సేఫ్టీ పూర్తిగా రక్షణలో ఉంటాయి, యాప్‌ ప్రజలకు సెక్యూరిటీ సపోర్ట్ ఇస్తుంది, బలవంతం కాదు” అని తెలిపారు.

ఫోన్లు తరచుగా మిస్సయ్యే ప్రమాదం ఉన్నవారు, ఆన్‌లైన్ ఫ్రాడ్ లేదా స్కామ్ కాల్స్‌కు భయపడేవారు, డిజిటల్ సేఫ్టీపై దృష్టి పెట్టే యూజర్లు ఈ అప్ ని వాడుకోవాలని తెలిపారు.

Sanchar Saathi App అవసరమైన వారికి మంచి యాప్, కానీ తప్పనిసరి కాదు. ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఎవరైనా వాళ్ళ ఇష్టానుసారం ఉపయోగించుకోవచ్చు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు