తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 శనివారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర అభివృద్ధి, ప్రపంచ స్థాయి పెట్టుబడుల అవకాశాలు, స్టార్టప్ ఇన్నోవేషన్, టెక్నాలజీ ప్రోగ్రెస్‌పై దృష్టి సారిస్తూ ఈ సమ్మిట్‌ను ప్రారంభించారు.

వివిధ దేశాల నుంచి వచ్చిన గ్లోబల్ బిజినెస్ లీడర్లు, CEOs, ఇన్వెస్టర్లు, పాలసీ మేకర్లు ఈ సమ్మిట్‌కు హాజరై తెలంగాణ భవిష్యత్ వృద్ధి అవకాశాలపై చర్చలు జరుపుతున్నారు.
ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ నాయకులు “పెట్టుబడులు మరియు ఆవిష్కరణలకు తెలంగాణ ఇప్పుడు ప్రపంచ గమ్యస్థానంగా మారింది,” అని తెలిపారు మరియు ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులకు తెలంగాణ ఓ ప్రముఖ కేంద్రంగా ఎదుగుతోందని అన్నారు.
అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులను తెలంగాణకు ఆకర్షించడం, స్టార్టప్ ఎకోసిస్టమ్ నిలబెట్టడం, దాన్ని విస్తరించడం, IT, AI, రోబోటిక్స్, EV టెక్నాలజీ, హెల్త్‌టెక్ వంటి రంగాలలో సహకార ఒప్పందాలు, ప్రపంచ వ్యాపార సంస్థలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేయడం, కొత్త ఉద్యోగ అవకాశాల సృష్టి, ఇవే ఈ సమ్మిట్ ముఖ్య ఉద్దేశం.
ఈ సమ్మిట్‌కు అమెరికా, యూరప్, జపాన్, సింగపూర్ వంటి దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే ప్రముఖ టెక్ కంపెనీలు, మాన్యుఫాక్చరింగ్ సంస్థలు, ఎనర్జీ & ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్ సంస్థలు, ఫైనాన్స్ గ్రూప్స్ కూడా హాజరయ్యాయి.
ఈ సుమ్మిత్ తో తెలంగాణ ని గ్లోబల్ బిజినెస్ హబ్ గా నిలబెట్టే అవకాశం ఉంది, అలాగే అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు చేసే కీలక వేదిక కూడా ఇది. రాష్ట్ర ఆర్థిక వృద్ధికి భారీ ప్రోత్సాహం, అలాగే యువతకు కొత్త ఉద్యోగాలు, స్టార్టప్స్‌కు ఫండింగ్ కూడ ఏర్పడతాయి.
తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 రాష్ట్ర అభివృద్ధి దిశగా కీలక మైలురాయిగా నిలిచింది. ప్రపంచ పెట్టుబడిదారులు తెలంగాణపై చూపుతున్న నమ్మకం భవిష్యత్తులో రాష్ట్ర ఆర్థిక శక్తిని మరింత బలోపేతం చేయబోతోంది.
