వివాదాల మధ్య రిలీజ్ అయిన ది తాజ్ స్టోరీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

వివాదాల మధ్య రిలీజ్ అయిన ది తాజ్ స్టోరీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

ప్రముఖ నటుడు పరేష్ రావల్ ప్రధాన పాత్రలో నటించిన ది తాజ్ స్టోరీ సినిమా అనేక వివాదాల మధ్య థియేటర్లలో విడుదలైంది. షాజహాన్ నిజంగా తాజ్ మహల్ను నిర్మించాడా అనే చర్చను ఈ సినిమా ప్రస్తావించడంతో విడుదలకు ముందే ఇది పెద్ద చర్చకు దారితీసింది.

దాదాపు నాలుగు నెలల తర్వాత ఈ సినిమా ఇప్పుడు ఓటీటీకి రానుంది. ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది.

ది తాజ్ స్టోరీ 2026 మార్చి 13 నుంచి లయన్స్ గెటెప్లే లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో పరేష్ రావల్, నమిత్ దాస్, జాకిర్ హుస్సేన్, శిశిర్ శర్మ, బ్రిజేన్ద్ర కాల, అమృత కాన్విల్కర్, స్నేహ వాఘ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఈ చిత్రాన్ని తుషార్ అమ్రిష్ గోయెల్ రచించి దర్శకత్వం వహించారు. సినిమాటోగ్రఫీని సత్యజిత్ హాజర్నీస్ నిర్వహించగా, సంగీతాన్నిరోహిత్ శర్మమరియు రాహుల్ దేవ్ నాథ్ అందించారు. ఈ చిత్రాన్ని సి ఏ సురేష్ జా నిర్మించారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు