IPL 2024: ఐపీఎల్ అంటే చూడని వారు ఎవరు లేరు, గత నలభై రోజులుగా ఉత్కంఠ భరితంగా సాగుతున్న ఈ ఐపీఎల్ దాదాపు సగం వరకు వచ్చేసింది. అయితే ప్రతి సీజన్లో లో ఏదో ఒక టీం అద్భుతమైన ప్రదర్శనతో ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అలా ఈసరి ఆశ్చర్యానికి గురి చేసింది SRH . గత కొన్ని సీజన్స్ లో SRH ప్రదర్శన పేలవంగా ఉండేది అన్న విషయం తెలిసిందే, కానీ ఈసారి మాత్రం ప్రతి మ్యాచ్ లో విజృంబిస్తున్నారు.
ఇప్పటికి SRH ఏడూ మ్యాచ్లు ఆడి మూడవ స్తానంకి చేరుకుంది. ఇక మొన్న SRH మరియు RCB కి జరిగిన మ్యాచ్ ఇప్పటికి ఎవరు మర్చిపోవట్లేదు. ఐపీఎల్ లోనే 287 అత్యధిక స్కోర్ చేసి SRH రికార్డు సృష్టించింది.
ఇక RCB పరిస్థితి ఎప్పటిలాగే దారుణంగా తయారయింది. ఎనిమిది మ్యాచ్లు ఆడగా కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. RCB 10 వ స్తానంలో ఉండడం చుసిన విరాట్ కోహ్లీ అభికిమానులు తట్టుకోలేక పోతున్నారు. ఇక మళ్ళి రేపు జరగబోయే మ్యాచ్ అంటే ఏప్రిల్ 25 న హైదరాబాద్ లో జరగబోయే మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఉత్కంటంగా ఎదురుచూస్తున్నారు.
ఇక మళ్ళి SRH బ్యాటర్లు సిక్సులు మోత మోగిస్తారు లేక RCB ఈసారైనా గెలుస్తుందా అనే ఉంత్కంఠత క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. అయితే మొన్న KKR తో జరిగిన మ్యాచ్ లో ఒక్క రన్ తో RCB ఓడిపోయినా విషయం తెల్సిందే. ఆరోజు 221 రన్స్ స్కోర్ చేయగలిగింది అంటే, ఈసారి SRH జరగబోయే మ్యాచ్ల్లో SRH 200 స్కోర్ కొట్టిన RCB ఆ స్కోర్ ని అవలీలగా కొట్టగలడు ఉన్ని ప్రెడిక్షన్స్ చెప్తున్నాయి.
విరాట్ కోహ్లీ మంచి ఫామ్లో ఉన్న విషయం తెల్సిందే, ఇక డుప్లెసిస్, దినేష్ కార్తీక్ బాగా ఆడుతున్నారు. అయితే స్కోర్ చేయడం పెద్ద ప్రాబ్లెమ్ కాదు కానీ. చిక్కొచ్చిందల్లా పేలవమైన బౌలింగ్. ఇక రేపు జరగబోయే మ్యాచ్ లో సిరాజ్ రంగంలోకి దిగుతాడు అని చెప్తున్నారు. ఇప్పటీ టికెట్ రేట్స్ తారాస్థాయి కి చేరుకున్నాయి, ఇక బెట్టింగ్ గురించి అయితే చెప్పనక్కర్లదు. చూద్దాం మరి SRH గెలుస్తుందా లేక RCB గెలుస్తుందా.