టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన కుటుంబంలో మరోసారి అనుకోని సంఘటన చోటుచేసుకుంది. కొన్ని రోజులు క్రితం ఆమె తండ్రి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగా, ఇప్పుడు వరుడు, మ్యూజిక్ డైరెక్టర్ పాలష్ ముచ్చల్ కూడా అస్వస్థతతో హాస్పిటల్‌కు తరలించబడటం వార్తల్లో నిలిచింది. ఈ వరుస ఆరోగ్య సమస్యలు మంధాన కుటుంబాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి.

వివాహ ఏర్పాట్లు జోరుగా జరుగుతున్న సమయంలో పాలష్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కు వెంటనే తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారని, స్టేబుల్‌గా ఉన్నారని తెలుస్తోంది.
స్మృతి మంధాన ఇటీవలే భారత మహిళల క్రికెట్ టీమ్‌తో బిజీగా ఉన్నప్పటికీ, ఇంట్లో జరుగుతున్న ఆరోగ్య సమస్యలు ఆమెను మానసికంగా ఇబ్బంది పెడుతున్నాయనే కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
తండ్రి అనారోగ్యం, ఇప్పుడు వరుడు పాలష్ ఆసుపత్రిలో చేరిక, ఈ రెండు ఘటనలు వరుసగా జరగడంతో అభిమానులు మంధానకు ధైర్యం చెబుతూ పోస్టులు చేస్తున్నారు.
ఇద్దరి వివాహం జరగాల్సిన సమయం లో ఇలా వరుసగా చోటుచేసుకుంటున్న ఆరోగ్య సమస్యలు వివాహ ఏర్పాట్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్మృతి మంధానకి భారత క్రికెట్ ఫ్రాటర్నిటీ, అభిమానులు సోషల్ మీడియాలో సానుభూతి తెలియజేస్తూ, పాలష్ ముచ్చల్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. కొంతమంది సెలబ్రిటీలు కూడా రికవరీ విషయంలో ఆశాభావం వ్యక్తం చేశారు.
