భారత్‌పై స్టబ్స్–జోర్జీ దాడి: రెండో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా భారీ లీడ్

ఇండియా vs సౌతాఫ్రికా రెండో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ చేసిన దూకుడు బ్యాటింగ్ మ్యాచ్‌ను పూర్తిగా ప్రోటియాస్ పక్షానికే మళ్లించింది. ట్రిస్టన్ స్టబ్స్ మరియు డి జోర్జీ కలిసి నిర్మించిన అద్భుతమైన సెంచరీ పార్ట్‌నర్‌షిప్ దక్షిణాఫ్రికా ఆధిక్యాన్ని 549 పరుగులు వరకు తీసుకువెళ్లింది. ఈ భారీ లీడ్‌తో టీమ్ ఇండియా ఒత్తిడిలో పడింది.

India vs South Africa Test

స్టబ్స్ శతకానికి సమీపంలో నిలిచిన దూకుడు ఇన్నింగ్స్, డి జోర్జీ అద్భుతమైన టెక్నికల్ బ్యాటింగ్ తో ఇద్దరూ కలిసి 150+ పరుగుల కీలక భాగస్వామ్యం చేసారు, ఇద్దరు కలిసి స్పిన్ & పేస్ నీ ధైర్యంగా ఎదుర్కొన్నారు.

భారత బౌలర్లు ప్రయత్నించినా, SA బ్యాటర్స్‌పై ప్రభావం చూపలేకపోయారు. బుమ్రాహ్, సిరాజ్, కుల్దీప్ వంటి బౌలర్లు బ్రేక్‌థ్రూ ఇవ్వడంలో విఫలం అయ్యారు.

పిచ్‌పై బౌలర్స్‌కు ఏ సహాయం లేకపోవడం, SA బ్యాట్స్మన్ గేమ్‌ను పూర్తిగా కంట్రోల్‌లోకి తీసుకోవడంతో ఈ భారీ లీడ్ భారత్‌కు రెండో ఇన్నింగ్స్‌లో మరింత ఒత్తిడిని సృష్టించింది.

దక్షిణాఫ్రికా 549 పరుగుల భారీ ఆధిక్యం సాధించడం టీమ్ ఇండియాకు సంక్షోభ పరిస్థితే.

549 రన్స్ చేజ్ చేయడం అసాధ్యం, కనీసం డ్రా కోసం బరిలో నిలబడాలంటే టాప్ ఆర్డర్ పెద్ద ఇన్నింగ్స్ ఆడాలి, పిచ్ నెమ్మదిగా టర్న్ అవుతున్నందున స్పిన్ బౌలింగ్‌కి సహాయం పెరిగే అవకాశం కూడా ఉంది.

భారత్ ఈ టెస్ట్ మ్యాచ్‌లో నిలబడాలంటే టాప్ ఆర్డర్ పెద్ద ఇన్నింగ్స్ ఆడాలి. రెండో ఇన్నింగ్స్‌లో సహనం కీలకం, డే 4 & 5 లో స్పిన్ బౌలింగ్ ప్రధాన సవాలు కాబోతుంది.భారత్ తప్పులు చేస్తే మ్యాచ్ పూర్తిగా SA విజయం దిశగా వెళ్తుంది.

స్టబ్స్–డి జోర్జీ శతక భాగస్వామ్యం ఈ టెస్ట్‌ను దక్షిణాఫ్రికా పక్షాన గట్టిగా నిలిపేసింది. 549 రన్స్ లీడ్‌తో ఇప్పుడు భారత జట్టుకు మ్యాచ్‌ను కనీసం సేవ్ చేయడం కూడా చాల కష్టం. రాబోయే సెషన్లు ఈ టెస్ట్ ఫలితాన్ని నిర్ణయించబోతున్నాయి.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు