గూగుల్ లో సెర్చ్ చేస్తే ఏదైనా దొరుకుతుందంటారు..“No 1 420 in India” అని గూగుల్ లో టైప్ చేస్తే ఏకంగా ఆంధ్రప్రదేశ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ టాపిగ్ వైరల్ గా మారింది. జనసేన, టీడీపీ ఫ్యాన్స్ దీన్ని ఉపయోగించుకొని ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. ఒకప్పుడు గూగుల్ లో ఇలాంటి వివాదాస్పద సెర్చింగ్ లు చాలానే జరిగాయి. అప్పట్లో “ugliest language” అని టైప్ చేస్తే కన్నడ భాషకి సంబంధించిన సమాచారం వచ్చింది.
గూగుల్ లో “no 1 420”, “who is 420 in india”, “andhrapradesh 420 images”, “no 1 corruption king in andhra pradesh”, ఇలా టైప్ చేస్తే సీఎం జగన్ కి సంబంధించిన అవినీతి వార్తలు దర్శనమిస్తున్నాయి. వైసీపీ కార్యకర్తలు ఈ సర్చెంగ్లపై, గూగుల్ పై మండిపడుతున్నారు. జగన్ అభిమానులు వీటిని కౌంటర్ చేస్తున్నారు.
నిన్న డిసెంబర్ 21న సీఎం వైఎస్ జగన్ 49వ పుట్టినరోజుని జరుపుకున్నారు. ఆయన అభిమానులు జన్మదిన వేడుకలను రాష్ర్ట్రవ్యప్తంగా ఘనంగా నిర్వహించారు. టీడీపీ ఫ్యాన్స్, జనసేన పవన్ కళ్యాన్ ఫ్యాన్స్ ఈ “no 1 420” గూగుల్ సర్చింగ్ టాపిగ్ ని వైరల్ చేశారు. గూగుల్ ఇలా ఎలా చూపెడుతోందని సాధారణ నెటిజన్ కూడా షాక్ అవుతున్నారు.
పవన్ కళ్యాన్ కు టాలీవుడ్ లోనే కాదు పొలిటికల్ గా కూడా వీపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇటీవళ పవన్ కళ్యాన్ అనేక సందర్భాల్లో సీఎం జగన్ ని, అతని పాలనని తీవ్రంగా విమర్శిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు, జనసేన ఫ్యాన్స్ కలిసి జగన్ పై చేస్తున్న విమర్శల కారణంగా గూగుల్ ఇలా చూపెట్టి ఉండవచ్చని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సీఎం జగన్ అధికారంలోనే ఉన్నారు కాబట్టి ఈ గూగుల్ సర్చింగ్ పై ఏమైనా నిర్ణయం తీసుకుంటారా.. లేక పెట్టి పాలిటిక్స్ అనుకొని వదిలేస్తారా వేచి చూడాలి.
ఇవి కూడా చూడండి: