పాఠశాలలకు సెలవులు ప్రకటించిన Ap ప్రభుత్వం

ఆంద్రప్రదేశ ప్రభుత్వం తాజాగా పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరికొన్ని రోజుల్లో క్రిస్మస్ పండగ రానుండడం వచ్చే ఏడాది సంక్రాంతి కావడంతో ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.

పాఠశాలలకు సెలవులు ప్రకటించిన Ap ప్రభుత్వం

23 నుంచి సెలవులు..

అయితే ప్రకటించిన సెలవులు క్రిస్టియన్ మిషినరీ స్కూళ్లకు, సాధారణ స్కూళ్లకు వేరు వేరుగా ఉంది. సాధారణ స్కూళ్లకు ఈ నెల 23 నుంచి 25 వరకు సెలవులు, 26 నుంచి మళ్లీ తరగతులు ప్రారంభమవుతాయి. క్రిస్టియన్ మెషినరీ స్కూళ్లకు ఈ నెల 23 నుంచి డిసెంబర్ 30వ తేదీ వరకు ప్రకటించారు. 31వ తేదీ నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి.

సంక్రాంతికి 7 రోజులు

ఇక సంక్రాంతి సెలవుల విషయానికి వస్తే.. జనవరి 10 నుంచి జనవరి 15 వరకు ప్రభుత్వం పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. అయితే ఈ సెలవులు క్రిస్టియన్ మెషినరీ స్కూళ్లకు వర్తించదు. 16వ తేదీ ఆదివారం కావడంతో జనవరి 17 నుంచి పాఠశాలలు పున:ప్రారంభమవుతాయి.

ఈ సెలవులన్నింటినీ రాష్ట్ర ప్రాధమిక విద్యా శాఖ ఎన్సీఆర్టీ క్యాలెండర్ లో పొందుపరిచింది. అయితే చలి తీవ్రంగా ఉండడం, పండుగలు కూడా కలిసి రావడంతో సెలవులు డిసెంబర్ 23 నుంచి 15 వరకు ప్రభుత్వం ప్రకటిస్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. సంక్రాంతి పండగ కారణంగా రెండు తెలుగురాష్ట్రాల్లో అనేక మంది స్వగ్రామాలకు వెళ్లడానికి సిధ్దమయ్యారు. మరికొందరు ఒమిక్రాన్ వైరస్ ఎక్కడ విజృంభిస్తుందోనని బిక్కుబిక్కుమంటున్నారు.

పాఠశాల సెలవులు – డిసెంబర్ 23 నుంచి 25, జనవరి 10 నంచి 15

క్రిస్టియన్ మిషినరీ పాఠశాల సెలవులు – డిసెంబర్ 23 నుంచి డిసంబర్ 30

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు