Psycho Varma Review: సైకో వర్మ మూవీ రివ్యూ

Psycho Varma Review: ప్రముఖ ప్రొడ్యూసర్ నట్టికుమార్ తనయుడు నట్టి క్రాంతి ప్రధాన పాత్రలో నటించిన సైకో వర్మ చిత్రం థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. నట్టి క్రాంతి పర్ఫామన్స్ అదిరిందంటూ క్రిటిక్స్ సైతం మంచి రివ్యూస్ ఇస్తున్నారు. సినిమాను చూసిన ప్రేక్షకులు పర్వాలేదని అంటున్నారు. కొద్దిగా కథలో మార్పులు చేసి ఉంటే బాగుండేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా రివ్యూకు సంబంధించిన మరిన్న విషేషాలను తులుసుకుందాం.

Psycho Varma Review

కథ

సైకో వర్మ పూర్తిగా ఓ థ్రిల్లర్ సినిమా. నట్టి క్రాంతి ఈ మూవీలో సైకో లక్షణాలు ఉన్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వర్మగా యాక్ట్ చేస్తాడు. హీరోయిన్ గా సుపుర్ణ మలాకర్ నటిస్తుంది. వర్మ హీరోయిన్ తో ప్రేమలో పడతాడు. ఇద్దరూ ప్రేమించుకుంటారు. అయితే వర్మ ఆమెను హత్య చేస్తాడు. వరుసగా అనేక మంది అందమైన అమ్మాయిలను చంపుతూ ఉంటాడు. హత్య చేసిన తరువాత వారి చేతిపై లవ్ సింబల్ ను వేసి వెళ్లిపోతాడు. ఇలా ఎన్నో హత్యలను వరుసగా చేస్తుంటాడు వర్మ. పోలీసులు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. చివర్లో వచ్చే ట్విస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

తారాగణం

సైకో వర్మ సినిమాకు నట్టికుమార్ దర్శకత్వం వహించారు. నట్టి కుమార్ కూతరు నట్టి కరుణ దీనిని తమ సొంత బ్యానర్ నట్టి ఎంటర్టైన్మెంట్స్ పై నిర్మించారు. నట్టి క్రాంతి, సుపుర్ణ మలాకర్ ప్రధాన పాత్రలో కనిపిస్తే.. చమ్మక్ చంద్ర, కేదర్ శంకర్, సంధ్య ముఖ్య పాత్రల్లో నటించారు. రవి శంకర్ సంగీతాన్ని సమకూర్చగా ఆర్. జనార్ధన్ నాయుడు సినిమాటోగ్రఫీని గౌతం రాజు ఎడిటింగ్ ను హ్యాండిల్ చేశారు.

సినిమా ఎలా ఉందంటే?

సైకో వర్మ ఓ మంచి థ్రిల్లర్ సినిమా. నట్టి క్రాంతి సైకో వర్మ పాత్రలో అద్భతంగా నటించాడు. కథ, డైలాగ్స్ లో కొంత మార్పులు చేసి ఉంటే సినిమా ఇంకా బాగా వచ్చేంది.

మూవీ రేటింగ్: 3.5 /5

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు