Shyam Singha Roy OTT Date, Time: శ్యామ్ సింగరాయ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, ప్లాట్ ఫారమ్, టైమింగ్

Shyam Singha Roy OTT Date, Time: ఎప్పుడెప్పుడా అని ఎదరుచూస్తున్న శ్యామ్ సింగరాయ్ ఎట్టకేలకు నెట్ ఫ్లిక్స్ లో జనవరి 21న రిలీజ్ కాబోతోంది. ఈ రోజు రాత్రి 12 గంటల నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతోంది శ్యామ్ సింగరాయ్. సాయి పల్లవి, నాని, క్రితి షెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయి బాక్సాఫీస్ లో మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది.

Shyam Singha Roy OTT Date, Time

శ్యామ్ సింగరాయ్ మూవీ (OTT Date, Time) ఓటీటీ రిలీజ్ డేట్, ప్లాట్ ఫారమ్, టైమింగ్

నాని, సాయి పల్లవి ఫ్యాన్స్ కు ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో రావడంతో వారికి ఇది పెద్ద పండగే అని చెప్పుకోవచ్చు. కరోనా కారణంగా కొంత మంది థియేటర్లో సినిమాను చూడ్డానికి భయపడ్డారు. అలాంటి వారికి ఇప్పుడు ఈ నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ పెద్ద ట్రీట్ అనుకోవచ్చు. స్వాతంత్ర్యం ముందు నాటి బెంగాల్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

టాక్సివాలా సినిమా ఫేమ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. వెంకట్ ఎస్ బోయనపల్లి దీన్ని నిహారికా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించారు. నాని, సాయి పల్లవి, క్రితి షెట్టి, మడోన్నా సెబాస్టియన్ ప్రధాన పాత్రలో నటించారు. రాహుల్ రవీంద్రన్, మురళి శర్మ, అభినవ్ గోమతమ్ సపోర్టింగ్ రోల్స్ ప్లే చేశారు. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని సమకూర్చగా సను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు. సత్యదేవ్ జంగ రాసిన ఈ కథని రాహుల్ సంకృత్యాన్ అద్భుతంగా తెరకెక్కించారు.

శ్యామ్ సింగరాయ్ నెట్ ఫ్లిక్స్ లో జనవరి 21 మొదలవుతున్నా సమయం అంటే జనవరి 20 ఎండింగ్ రాత్రి 12 గంటలకు ఈ సినిమా స్ట్రీమ్ అవడం స్టార్ట్ అవుతుంది. మిస్ కాకుండా ఈ సినిమాను సాధ్యమైనంత త్వరలో చూసెయ్యండి.

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు