Pelli SandaD OTT Release Date, Timing: శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీలీలా ప్రధాన పాత్రలో నటించిన సినిమా పెళ్లిసందడి త్వరలో ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమా ఫిబ్రవరీ 2022 మొదటి వారంలో ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో రిలీజ్ అవబోతోందనే టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై పెళ్లి సందడి టీం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. పెళ్లి సందడి సినిమా ఇప్పటికే థియేటర్లలో రిలీజ్ అయి బాక్సాఫీస్ లో బ్రహ్మాండమైన కలెక్షన్స్ రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఇంకో నెలలో ఈ సినిమా ఓటీటీలో కూడా స్ట్రీం కానుంది.
పెళ్లి సందడి మూవీ (OTT Date, Time) ఓటీటీ రిలీజ్ డేట్, ప్లాట్ ఫార్మ్, టైమింగ్
గౌరీ రొనంకి ఈ పెళ్లి సందడి సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శఖులు రాఘవేంద్ర రావు గైడెన్స్ లో ఆయన ఈ మూవీను తెరకెక్కించారు. శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక, శ్రీలీలీ ఈ సినిమాలో ప్రధాన పాత్రలని పోషించారు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని కలిసి దీన్ని ఆర్కే ఫిలిం అసోషియేట్స్, అర్కా మీడియా వర్క్స్ బ్యానర్ లో నిర్మించారు. ఎం.ఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చగా, సునీల్ కుమార్ నామా సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు.
అక్టోబర్ 15, 2021న ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. 8 కోట్లతో నిర్మించిన ఈ మూవీ సుమారు 20 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టుకుంది. సీనియర్ నటుడు శ్రీకాంత్ 1996లో పెళ్లి సందడి సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆ మూవీని రాఘవేంద్ర రావు తెరకెక్కించారు. ఆ సినిమా హిట్ కొట్టినట్టే ఈ సినిమా కూడా భారీ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.
ఈ కొత్త పెళ్లిసందడి సినిమా ఈటీవీ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అయిన ఈటీవీ విన్ లో ఫిబ్రవరీ మొదటి వారంలో స్ట్రీమ్ కాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ “ఈటీవీ విన్” యాప్ ప్రస్తుతం మీకు ప్లే స్టోర్ లో అవైలబుల్ గా ఉంది. అక్కడి నుంచి డౌన్ లోడ్ చేసుకనొ ఈ మూవీని వాచ్ చేయవచ్చు. ఈ యాప్ కు ప్రస్తుతానికైతే ఎలాంటి సబ్స్ క్రిప్షన్ చార్జస్ కూడా లేవు. పెళ్లి సందడి ఓటీటీ రిలీజ్ విషయమై ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇవి కూడా చూడండి
- Akhanda Box Office Collection: అఖండ బాక్స్ ఆఫీస్ కలెక్షన్
- Akhanda OTT Release Date: అఖండ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, ఫ్లాట్ ఫారమ్, టైమింగ్
- Rowdy Boys Boxoffice Collection: రౌడీ బాయ్స్ బాక్సాఫీస్ కలెక్షన్
- Shyam Singha Roy Box Office Collection: శ్యాంసింగరాయ్ బాక్సాఫీస్ కలెక్షన్