Vijay Devarakonda Upcoming Movies List: అర్జున్ రెడ్డి సినిమాతో తన కెరీర్ లోనే పెద్ద బ్రేక్ ఇచ్చుకోవడంతో పాటు టాలీవుడ్ లో టాప్ స్టార్ గా ఎదిగి బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపును సంపాదించాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ బిజియెస్ట్ యాక్టర్ గా ఎదిగాడు. ఎందరో టాప్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు విజయ్ తో సినిమాలను సైన్ చేయించుకున్నారు.
ప్రస్తుతం ప్యాన్ ఇండియా మూవీ లైగర్ ఆగస్టు 25, 2022న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలవుతున్నా విషయం తెలిసిందే. అయితే విజయ్ దేవరకొండ మరిన్ని అపకమింగ్ మూవీస్ వివరాలను ఈ ఆర్టికల్ లో అందించాము.
లైగర్
పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో వస్తున్న ఈ ప్యాన్ ఇండియా సినిమాలో విజయ్ బాక్సర్ గా నటిస్తున్నాడు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. కరణ్ జోహార్, ఛార్మీ కౌర్ కలిసి ఈ మూవీని ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై నిర్మించారు. 150 కోట్ల బడ్జెట్ సినిమాలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కూడా కెమియో అప్పియరెన్స్ ఇవ్వనున్నాడు. ఆగస్టు 25, 2022న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
హీరో
విజయ్ దేవరకొండ, మాలవిక మోహన్ ప్రధాన పాత్రలో ఆనంద్ అన్నమలై దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. మైత్నీ మూవీ బ్యానర్స్ లో ఈ సినిమాను నిర్మించనున్నారు. కన్నడ యాక్టర్ దిగంత్ మాఖలె మెయిన్ లీడ్ రోల్ ప్లే చేయనున్నారు. ప్రదీప్ కుమార్ సంగీతాన్ని సమకూర్చనున్నారు. వెన్నెల కిషోర్, శరన్, కిట్టీ కూడా ఈ సినిమాలో అలరించనున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది లాంటి వివరాలు తెలియాల్సి ఉంది.
అన్ టైటిల్డ్ విజయ దేవరకొండ 12వ సినిమా
విజయ దేవరకొండ తన 12వ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ లో చేయనున్నారు. శివ నిర్వణ దీనికి దర్శకత్వం వహించనున్నారు. ఇతర నటినటులు ఎవరు.. సినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతోంది లాంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా
సుకుమార్ దర్శకత్వంలో కూడా విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించనున్నారు. కేదార్ సిలగంశెట్టి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయనున్నారు. ప్రస్తుతం సుకుమార్ తో పాటు విజయ్ దేవరకొండ కూడా చాలా బిజీ గా ఉండడంతో ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం కాబోతోందనే వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చూడండి
- Akhanda Box Office Collection: అఖండ బాక్స్ ఆఫీస్ కలెక్షన్
- సినీ తార పరిచయం ఎపిసోడ్ 1: చిడతలు అప్పారావు, కళ్ళు చిదంబరం, వొమ కూచి నరసింహన్
- Shyam Singha Roy OTT Date, Time: శ్యామ్ సింగరాయ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, ప్లాట్ ఫారమ్, టైమింగ్
- Akhanda OTT Release Date: అఖండ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, ఫ్లాట్ ఫారమ్, టైమింగ్