సినీ తారల పరిచయం ఎపిసోడ్ 2: హరినాథ్, రామకృష్ణ, కాంతారావు

సెకండ్ హీరో అనే మాట ఒకప్పుడు తెలుగు సినిమాలో చాలా బాగా వినిపించేది. ఇప్పడు ఆ పాత్ర ఎప్పుడో ఒకప్పుడు కనిపిస్తుంది. పాత సినిమాలలో సెకండ్ హీరో పాత్రకి మంచి గుర్తింపు ఉండేది. మెయిన్ హీరో పాత్ర సెకండ్ హీరో ని రక్షించడం, చెడు దోవలో వెళ్లకుండా చూడటం లాంటి విషయాల పై దృష్టి పెట్టేది. మరోవైపు కథను మలుపు తిప్పే విషయంలో ఈ సెకండ్ హీరోల పాత్ర చాలా కీలకం. ఉదాహరణకు అన్నయ్య సినిమాలో చిరంజీవి మెయిన్ హీరో అయితే రవి తేజ అలాగే వెంకట్ కూసింత సెకండ్ హీరో పాత్రలు పోషించినట్లే.

హరినాథ్, రామకృష్ణ, కాంతారావు

ఇప్పుడు అలనాటి సెకండ్ హీరోలో గురించి పరిచయం చేయబోతున్నాం.

హరనాథ్ (బుద్ధరాజు వెంకట అప్పల హరినాథ రాజు) తెలుసు సినిమాలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగారు ఈయన. ఒకవైపు కథానాయకుడుగా చేస్తూనే మరోవైపు సైడ్ హీరో గా చేశారీయన. ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణ సినిమాలలో కనిపించారు. సుమారు 117 తెలుగు సినిమాలు, 12 తమిళం, 1 హిందీ, 1 కన్నడం సినిమాల్లో నటించాడు.

రామకృష్ణ ప్రముఖ తెలుగు సినిమా హీరో మరియు నటుడు. దాదాపు 200 చిత్రాలు విభిన్నమైన భాషలలో నటించారు. తెలుగులో ‘నోము’, ‘పూజ’, ‘నేను నా దేశం’, ‘బొమ్మ బొరుసా’, ‘బడి పంతులు’, ‘కురుక్షేత్రం’, ‘యువతరం కదిలింది’, ‘మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర వైభవం’ వంటి పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. కథా భలం వున్న సినిమాలలో ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణ, శోభన్ బాబు సినిమాలలో సెకండ్ హీరోగా నటించారు. ఈయన కూడా హరినాధ్ లాగానే తక్కువ వయసులోనే చనిపోయారు.

పౌరాణికాలంటే కాంతారావు, కాంతారావు అంటే పౌరాణికం అనే స్థాయికి వెళ్లారీయన. క్రమేపి తెలుగు సినిమా పౌరాణికాలు వదిలి సాంఘీక సినిమాల వైపు మళ్లడంతో ఈయన సాంఘీక సినిమాలో ఎక్కువగా నిలదొక్కుకోలేకపోయారు. అయితేనేం కాంతారావు జానపద చిత్రాల హీరోగా ముద్రపడినా ‘శభాష్ రాముడు’, ‘శాంతినివాసం’ , ‘రక్తసంబంధం’ వంటి సాంఘిక చిత్రాలు ఆయనకు మంచిపేరు తెచ్చాయి. కాంతారావుని చూసిన రామారావు తన ‘జయసింహ’ చిత్రంలో తమ్ముడి పాత్రనిచ్చి ప్రోత్సహించాడు. ‘జయ సింహ’ చిత్రంలో అన్నదమ్ములుగా నటించిన ఎన్టీఆర్, కాంతారావు, ఆ తర్వాత నిజజీవితంలో అన్నదమ్ములుగా మెలిగారు. వీరిద్దరు కలిసి.. ‘గౌరీ మహత్యం’, ‘శభాష్ రాముడు’, ‘భట్టి విక్రమార్క’, ‘రక్త సంబంధం’, ‘భీష్మ’, ‘ఆప్తమిత్రుడు’, ‘నర్తనశాల’ ‘లవకుశ’ ‘ఏకవీర’ వంటి అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. ‘లవకుశ’లో ఆయన నటకు జాతీయ అవార్డు వరించింది.

ప్రస్తుతం హీరో రవితేజ చిరంజీవి రాబోయే సినిమాలో మంచి నిడివి వున్న పాత్ర చేస్తున్నాడు అనగానే వీరంతా గుర్తుకొచ్చారు.

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు