Kothala Rayudu Movie Review: ఫ్యామిలీ స్టార్ శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన కోతల రాయుడు సినిమా ఎట్టకేలకు థియేటర్లలో ఈ రోజు, అంటే ఫిబ్రవరీ 4న గ్రాండ్ గా రిలీజ్ అయింది. తొలి రోజే ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. శ్రీకాంత్ కెరీర్ లో మరో మంచి కామెడీ ఫలింగా ఇది నిలిచిపోనుందని క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు.
కథ
కోతల రాయుడు సినిమా మొత్తం కామెడీ పాక్ మూవీ. అప్పులు తీసుకొని తెలివిగా ఎగ్గొట్టే క్యారెక్టర్ తో శ్రీకాంత్ అద్భుతంగా నటిస్తాడు. ఎప్పుడూ మనీ మైండ్ తో ఉండే శ్రీకాంత్ కు బాగా డబ్బు ఉన్న అమ్మాయితో వివాహం కుదుర్తుంది. దీంతో కథ మరింత ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. శ్రీకాంత్ తాను తీసుకున్న అప్పులను ఎలా తీర్చాడు, ఆ మహాలక్ష్మిని వివాహం చేసుకున్నాడా అనేది మూవీలో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్.
తారాగణం
సీహెచ్.సుధీర్ రాజు ఈ మూవీకు దర్శకత్వం వహించారు. ఆయనే దీనికి కథను కూడా అందించారు. శ్రీకాంత్, నటాషా దోషి, డింపుల్ చొపాడే ప్రధాన పాత్రలో నటించారు. సునీల్ కశ్యప్ సంగీతాన్ని సమకూర్చారు. ఎఎస్ కిశోర్, కొలన్ వెంకటేశ్ ఈ మూవీని ఎ.ఎస్.కె ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించారు. మురలి శర్మ, పోసాని కృష్ణ మురలి, పృధ్వి రాజ్, సుధ, హేమ, సత్యం రాజేష్ సపోర్టింగ్ క్యారెక్టర్ రోల్స్ ప్లే చేశారు.
మూవీ పేరు | కోతల రాయుడు |
దర్శకులు | సిహెచ్. సుధీర్ రాజు |
కథ, స్క్రీన్ ప్లే | సిహెచ్. సుధీర్ రాజు |
నటీ నటులు | శ్రీకాంత్, నటాషా దోషి, డింపుల్ చొపాడే |
సంగీత దర్శకులు | సునీల్ కశ్యప్ |
నిర్మాతలు | ఎఎస్ కిశోర్ & కొలన్ వెంకటేశ్ |
ప్రొడక్షన్ బ్యానర్ | ఎ.ఎస్.కె ఫిలిమ్స్ |
సినిమా ఎలా ఉందంటే
కోతల రాయుడు సినిమా..మొత్తం ఫ్యామిలీ కలిసి చూడదగ్గ సినిమా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ఎక్కడా బోర్ అనిపించద్దు. ఇందులో ప్రధానంగా ఉండే కామెడీ, మిమ్మల్ని కడుపుబ్బా నవ్విస్తుంది. 2022లోవచ్చిన మంచి తెలుగు కామెడీ సినిమా అని చెప్పుకోవచ్చు. చాలా ఏళ్ల తరువాత శ్రీకాంత్ మరో మంచి కామెడీ సినిమాతో మన ముందుకు వచ్చాడు