Athadu Aame Priyudu Movie Review: సునీల్, కౌశల్ మందా ప్రధాన పాత్రలో నటించిన సినిమా అతడు ఆమె ప్రియుడు సినిమా ఎట్టకేలకు థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. తొలి రోజు ఈ సినిమాకు మంచి టాక్ వినిపిస్తోంది. సునీల్ కామెడీ, కౌశల్ మందా యాక్టింగ్ అద్భుతంగా ఉందంటూ సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. యండమూరి వీరేంద్రనాధ్ డైరెక్షన్ సూపర్ అంటూ క్రిటిక్స్ సైతం రివ్యూలు ఇస్తున్నారు.
కథ
అతడు ఆమె ప్రియుడు సినిమా కేవలం ఒక జానర్ కు సంబంధించిన సినిమా కాదు. ఇందులో యాక్షన్, రొమాన్స్, కామెడీ, థ్రిల్, సైంటిఫిక్ ఫిక్షన్ అన్నీ ఉంటాయి. సినిమా స్టార్టింగ్ లో.. ప్రకృతి మానవుడిపై పగ తీర్చుకుంటుందని ఓ క్యారెక్టర్ చెప్తుంది. కరోనాతో ఇది ప్రారంభం అయిందని అంటుంది. ప్రళయంతో ఇది ఫుల్ స్టాప్ పెడుతుందని కూడా ఆ క్యారెక్టర్ చెబుతాడు. సునీల్, కౌశల్ మందా, ఇతర ప్రధాన నటులు అంతా ఒక ఇంట్లో ఉంటారు. కౌశల్ మందా ఒకతన్ని మర్డర్ చేస్తారు. కథ మొత్తం ఆ ఇంటి చుట్టే తిరుగుతూ ఉంటుంది. అసలు ఈ మూవీలో ఏంటా ప్రళయం, కౌశల మందా ఎందుకు మర్డర్ చేస్తాడనే విశయాలు తెలుసుకోవాలంటే మూవీను చూడాల్సిందే..
అతడు ఆమె ప్రియుడు మూవీ తారాగణం
ప్రముఖ రచయితలు యెండమూరి వీరేంద్రనాథ్ ఈ సినిమాకు కథను అందించడంతో పాటు ఆయనే దీనికి దర్శకత్వం వహించారు. రవి కనగాల, రాం తుమ్మలపాటి కలిసి దీన్ని సంధ్య మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు. సునీల్, కౌశల్ మంద, బెనర్జీ, మహేశ్వరి వడ్డి, ఇందులో మెయిన్ లీడ్ రోల్స్ ప్లే చేశారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాధ్యతలను మీర్ చేపట్టారు.
మూవీ పేరు | అతడు ఆమె ప్రియుడు |
డైరెక్టర్ | యెండమూరి వీరేంద్రనాథ్ |
నటీనటులు | సునీల్, కౌశల్ మంద, బెనర్జీ, మహేవ్వరి వడ్డి, ప్రియాంక, సుపుర్ణ, భూషన్, జెన్ని |
నిర్మాతలు | రవి కనగాల, రాం తుమ్మలప్పలి |
ప్రొడక్షన్ బ్యానర్ | సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ |
సినిమా ఎలా ఉందంటే
ప్రముఖ రచయిత, ఎన్నో వందల కథలు రాసిన యెండమూరి వీరేంద్రనాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో ఆశించినంత స్థాయిలో మూవీ లేదు. కథ బాగున్నప్పటికీ.. డైలాగ్స్, డైరెక్షన్ మరింత బెటర్ గా చేస్తే బాగుండేదనిపించింది. మొత్తం ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ సినిమా.
మూవీ రేటింగ్ : 2.5 / 5