Pataru Palem Prema Katha Review: పటారు పాళెం ప్రేమ కథ రివ్యూ

Pataru Palem Prema Katha Review: శ్రీ మానస్, సమ్మోహణ ప్రధాన పాత్రలో నటించిన పటారు పాలెం ప్రేమ కథ మూవీ ఎట్టకేలకు థియేటర్లలో ఈ రోజు ఫివ్రబరీ 4న గ్రాండ్ గా రిలీజ్ అయింది. తొలి రోజే ఈ సినిమాకు మంచి టాక్ వస్తుంది. మొన్న ప్రేమిస్తే.. నిన్న ఉప్పెన ఈ రోజు పటారు పాళెం అనే కాప్షన్ పోస్టర్ లో ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాను విడుదల చేశారు. ఈ సినిమా ఎలా ఉంది, ఆడియన్స్ రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం.

Pataru Palem Prema Katha Review

కథ

పటారు పాళెం సినిమా ఒక రొటీన్ రొమాంటక్ స్టోరీ. అయితే పేదింటి అబ్బాయి పెద్దింటి అమ్మాయిని ప్రేమించే కాన్సెప్ట్ తో ఈ మూవీ స్టోరీ సాగుతుంటుంది. ఇద్దరు ఘాడంగా ప్రేమించుకుంటారు. అమ్మాయి తల్లి దండ్రులు వారి పెళ్లికి నిరాకరిస్తారు. అబ్బాయిని హతమార్చే ప్లాన్ వేస్తారు. ఇద్దరూ ఊరి దాటి వెళ్లిపోదామని డిసైడ్ అవుతుంటే.. అప్పుడే వాళ్లని వెంబడించి చంపడానికి ప్రయత్నిస్తారు. చివరికి సినిమాలో ఏం జరిగింది. ఇద్దరూ తప్పించుకున్నారా..? పెళ్లి చేసుకున్నారా.? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు

వుపాటి దొరైరాజు ఈ సినిమాకు కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం వహించారు. ఆయనే దీనిని జెఎస్ ఫిలిం బ్యానర్స్ పై నిర్మించారు. శ్రీ మానస్, సమ్మోహన ప్రధాన పాత్రల్లో నటించారు. బాలు ధాకే సంగీతాన్ని సమకూర్చగా, రామ్ ముల్నిటి సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు. దేన ఆశ, చరణ్ కురుకొండ, వినయ్ వాసిరెడ్డి సపోర్టింగ్ రోల్స్ ప్లే చేశారు.

మూవీ పేరుపటారు పాళ్యం ప్రేమ కథ
డైరెక్టర్వుపాటి దొరైరాజ్
క్యాస్ట్ లీడ్స్శ్రీ మానస్, సమ్మోహన, దేన ఆశ, చరణ్ కురుకొండ, వినయ్ వాసి రెడ్డి
సంగీతంబాలు ధాకె
సినిమాటోగ్రఫీరామ్ ముల్నిటి
నిర్మాతవుపాటి దొరైరాజ్
ప్రొడక్షన్ హౌస్జె.ఎస్ ఫిలిమ్స్

సినిమా ఎలా ఉందంటే

సినిమాను ఒక సారి చూడవచ్చు. కొన్ని బోల్డ్ రొమాంటిక్ సిన్లు ఉండడం వల్ల ఫ్యామిలీతో కలిసి ఈ మూవీను చూడలేము. రొటీన్ స్టోరీ, నూతన నటినటులు, దర్శకులు అయినప్పటికీ బాగా ప్రెజెంట్ చేశారు. డైలాగ్స్, స్ర్కిప్ట్ లో ఇంకొంత వర్క్ చేసి ఉంటే సినిమా ఇంకా బాగా వచ్చేది.

మూవీ రేటింగ్ : 2.5 / 5

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు