K3 Kotikokkadu Movie Review: కె3 కోటికొక్కడూ మూవీ రివ్యూ

K3 Kotikokkadu Movie Review: కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రలో నటించిన కె3 కోటికొక్కడు సినిమా ఎట్టకేలకు థియేటర్లలో ఈ రోజు అంటే ఫిబ్రవరీ 4న గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ మూవీ కన్నడలో “కోటిగొబ్బ 3” టైటిల్ తో అక్టోబర్ 15, 2021లోనే రిలీజ్ అయింది. కన్నడలే మంచి టాక్ ను సొంతం చేసుకున్నట్లే ఇక్కడ తెలుగులో కూడా ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది. కిచ్చా సుదీప్ తెలుగు ప్రేక్షకులకు ఈగ సినిమా ద్వారా ఎక్కువగా పరిచయం అయ్యారు.

K3 Kotikokkadu Movie Review

 

కథ 

కోటికోక్కడు 3 సినిమా కన్నడలో వచ్చిన “కోటిగొబ్బ 2″కి సీక్వెల్ అని చెప్పుకోవచ్చు. ఇందులో హీరో ఒక పాపకు ట్రీట్మెంట్ ఇప్పించడానికి పోలాండ్ కు బయటుదేరుతాడు. ఎయిర్పోట్లో మడొన్న సెబాస్టియన్ తో పరిచయం అయి ప్రేమలో పడతాడు. పోలాండ్ తో దిగిన తరువాత అక్కడ పెద్ద బాంబ్ బ్లాస్ జరుగుతుంది. ఆ బ్లాస్ట్ లో వందల కోట్ల రూపాయలను దోచుకువెళ్లిపోతారు. ఇంటర్ పోల్ పోలీసులు సుదీప్ ను చేస్ చేస్తూ ఉంటారు. అసలు ఇంటర్ పోల్ సుదీప్ ను ఎందుకు చేస్ చేస్తున్నారు..? ఆ వందల కోట్లను ఎవరు దోచుకున్నారో తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే..

కె3 కోటికొక్కడు తారాగణం

కోటికొక్కడు సినిమాను శివ కార్తిక్ దర్శకత్వం వహించారు. సూరప్ప బాబు దీనిని రాంబాబు ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించారు. సుదీప్, మడోన్న సెబాస్టియన్ ప్రధాన పాత్రల్లో నటించారు. అర్జున్ జన్య సంగీతాన్ని సమకూర్చగా, శేఖర్ చంద్రు సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు. శ్రాద్ధా దాస్, పి రవి శంకర్, అఫ్తాబ్ శివదాసని, అభిరామి మెయిన్ సపోర్టింగ్ రోల్స్ ప్లే చేశారు.

మూవీ పేరుకె3 కోటికొక్కడు
డైరెక్టర్శివ కార్తిక్
క్యాస్ట్ లీడ్స్సుదీప్, మడోన్న సెబాస్టియన్, శ్రద్ధ దాస్
సంగీతంఅర్జున్ జన్య
సినిమాటోగ్రఫీశేఖర్ చంద్రు
నిర్మాతసూరప్ప బాబు
ప్రొడక్షన్ హౌస్రాంబాబు ప్రొడక్షన్స్

సినిమా ఎలా ఉందంటే

మొత్తం ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ సినిమా. 70 కోట్లతో నిర్మించిన ఈ సినిమాలో విజువల్స్ అద్భుతంగా వచ్చాయి. యాక్షన్ సీక్వెన్స్ అద్బుతంగా తెరకెక్కించారు. సుదీప్ నటన బాగుంది. డైలాగ్స్ బాగున్నాయి. అర్జున్ జన్య మంచి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ను అందించారు. స్క్రిప్ట్ లో ఇంకొంత వర్క్ చేసి ఉంటే బాగుండేదనిపించింది.

మూవీ రేటింగ్: 3 / 5

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు