Sehari Movie Review: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సెహరి సినిమా ఎట్టకేటకు థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ప్రేక్షకులను బాగా అలరించింది. తొలి రోజే ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. రీ రొమాంటిక్ కామెడీ చిత్రం రానున్న రోజుల్లో మరింత కలెక్షన్లు చేసుకొనేందుకు ముందుకు వెళ్తోంది.
కథ
సెహరి చిత్రం పూర్తిగా కామెడీ ఫ్యామిలీ డ్రామా అని చెప్పుకోవచ్చు. వరున్ పాత్రలో హర్ష్కనుమిల్లి, అమూల్య పాత్రలో సిమ్రన్ చౌదరీ నటించారు. వరున్ ఫ్రెండ్ వాసు పాత్రలో అభినవ్ గోమతమ్ యాక్ట్ చేశారు. సపోర్టింగ్ క్యారెక్టర్ పాత్రలో ప్రనీత్ రెడ్డి నటించారు. కథ విషయానికి వస్తే.. వరున ఒక అమ్మాయిన్ ప్రేమిస్తాడు, కానీ ఆమెతో బ్రేకప్ అయిపోతుంది. తొందరగా పెళ్లి చేసుకుందామని డిసైడ్ అవుతాడు. అయితే పెళ్లి చేసుకోబోయే అమ్మాయి సిస్టర్ తో హర్ష ప్రేమలో పడతాడు. దీని చూట్టే కథ మొత్తం ఫన్నీగా సాగుతుంది.
సెహరీ సినిమా క్యాస్ట్ , క్రూ
సినిమా పేరు | సెహరి |
నటీనటులు | హర్ష కనుమిల్లి, సిమ్రన్ ఛౌదరి, అభినవ్ గోమతమ్, ప్రనీత్ రెడ్డి కల్లెం, అక్షిత, స్నేహ విలిదిండి, కోటి, బాలకృష్ణ, రాజేశ్వరి ముల్లపూడి |
దర్శకులు | జ్ఞానసాగర ద్వారక |
నిర్మాత | అద్వయ జిష్ణు రెడ్డి |
సంగీతం | ప్రశాంత్ ఆర్ విహారి |
సినిమాటోగ్రఫీ | అరవింత్ విశ్వనాథన్ |
బ్యానర్ | వర్గో పిక్చర్స్ |
సినిమా ఎలా ఉందంటే?
సెహరీ సినిమా పూర్తగా కుటుంబంతో కలిసి చూడదగ్గ సినిమా. కామెడీని దర్శకులు బాగా పండించారు. అన్ని సినిమాల్లో లాగే అభినవ్ గోమతమ్ యాక్టింగ్ మనల్ని కడుపుబ్బా నవ్విస్తుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు మూవీ ఎక్కడా బోర్ కోట్టదు. సిమ్రన్ చౌదరీ పర్ఫామెన్స్ కూడా చాలా బాగుంది. కామిడీని మరింత బాగా ప్రెజెంట్ చేసి ఉంటే బాగుండేదనిపించింది.
మూవీ రేటింగ్: 3.5 /5