Khiladi Movie Box Office Collections: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఖిలాడి మూవీ ఎట్టకేలకు ఈ రోజు ఫిబ్రవరీ 11న గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ ఖిలాడి మూవీ హిందీలో కూడా రిలీజ్ అయి మంచి కలెక్షన్స్ రాబడుతుంది. తొలి రోజే ఈ మూవీ సుమారు 7 కోట్ల వరకు కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. వారంలో మూవీ బడ్జెట్ మొత్తం కలెక్షన్స్ లో రికవర్ అవుతుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు.
Khiladi Movie Box Office Collections (ఖిలాడి మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్)
డే వైజ్ | ఇండియా నెట్ కలెక్షన్స్ |
డే 1 | 4.20 కోట్లు |
డే 2 | 3.8 కోట్లు |
డే 3 | 2.9 కోట్లు |
డే 4 | |
డే 5 | |
డే 6 | |
డే 7 | |
మొత్తం కలెక్షన్స్ |
ఖిలాడి నటీనటులు
మోహన్ గాంధీ పాత్రలో రవితేజ్, పోలీస్ ఆఫీసర్ అర్జున్ భరద్వాజ్ పాత్రలో అర్జున్ సర్జ, హీరోయిన్ గా డింపుల్ హయతి ప్రధాన పాత్రలో నటించారు. రమేశ్ వర్మ ఈ మూవీని రచించడంతో పాటు ఆయనే దీనికి దర్శకత్వం వహించారు. సత్యనారాయణ కోనేరు రమేశ్ వర్మ ఈ సినిమాను పెన్ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చగా, సుజిత్ వాసుదేవ్, జి.కె. విష్ణు సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు.
సినిమా పేరు | ఖిలాడి |
నటీనటులు | రవితేజ, అర్జున్ సర్జ, ఉన్న ముకుందన్, మీనాక్ష చౌదరి, డింపుల్ హయతి |
దర్శకులు | రమేశ్ వర్మ |
నిర్మాత | సత్యనారాయణ కోనేరు, రమేశ్ వర్మ |
సంగీతం | దేవి శ్రీ ప్రసాద్ |
సినిమాటోగ్రఫీ | సుజిత్ వాసుదేవ |
బ్యానర్ | పెన్ స్టూడియోస్ |
ఖిలాడి ప్రీ రిలీజ్ బిజినెస్ (Khiladi Movie Pre-Release Business)
ఖిలాడి సినిమాను తెలుగుతో పాటు హిందీలో డబ్ చేసి కూడా రిలీజ్ చేశారు. మొత్తం మూవీని 35 నుంచి 40 కోట్లు ఖర్చు చేసి నిర్మించారని తెలుస్తోంది. రిలీజ్ కాకముండే 30 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ కూడా చేసేసింది. కేవలం నిజాం థియేటర్ల రైట్స్ ను 7 కోట్లకు అమ్మారు. ఏపీ, తెలంగాణ కలిపి 20 కోట్ల వరకు థియేటర్ రైట్స్ సేల్ జరిగింది. నార్త్ ఇండియాలో మరో రెండు కోట్లు వరకు అయిందని అంచనా. డిజిటల్ రైట్స్ కి కూడా బాగానే వచ్చిందని టాక్.