DJ Tillu Movie Review: సిద్దు, నేహా శెట్టి ప్రధాన పాత్రలలో నటించిన DJ టిల్లు చిత్రం ఈ రోజు ఫిబ్రవరి 12, 2022న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. ఊహించిన విధంగానే ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసి చాలా ఆనందించారు. సిద్ధు కామెడీ డైలాగులు, నటన ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. నేహాశెట్టి నటన కూడా ఈ చిత్రానికి హైలైట్.
కథ
డీజే టిల్లు పూర్తిగా రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం. టిల్లూ పాత్రలో సిధ్దు నటించారు. డిస్కో జాకీగా చేసే సిద్దు, నేహా శెట్టితో ప్రేమలో పడతాడు. నేహ శెట్టి తనను ప్రేమించిన తరువాత కూడా మోసం చేస్తుందని అనుకుంటాడు. కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఫన్నీగా సాగుతుంది. సమాజంలో చాలా మంది స్త్రీలను సోదరుడితో ఎక్కడికైనా వెళ్తే అపార్థం చేసుకుంటారు ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకొని దర్శకుడు విమల్ కృష్ణ మంచి సందేశాత్మక చిత్రాన్ని అందించారు.
DJ టిల్లు తారాగణం & సిబ్బంది
సిద్ధూ ఈ చిత్రానికి కథ, మాటలు అందించడంతో పాటు ప్రధాన పాత్రలో నటించారు. విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. నేహా శెట్టి కథానాయికగా నటించింది. ప్రిన్స్ సెసిల్, బ్రహ్మాజీ, ప్రగతి మరియు నర్రా శ్రీనివాస్ సహాయక పాత్రలు పోషించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ ఈ మూవీను నిర్మించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించగా, సినిమాటోగ్రఫీ సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, ఎడిటింగ్ నవీన్ నూలి హ్యాండిల్ చేశారు.
మూవీ పేరు | డిజె టిల్లు |
దర్శకత్వం | విమల్ కృష్ణ, సిద్దు జొన్నలగడ్డ |
నటీనటులు | సిద్దు, నేహ శెట్టి, ప్రిన్స్ సెసిల్, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రా శ్రీనివాస్ |
సంగీతం | శ్రీ చరణ్ పాకల |
సినిమాటోగ్రఫీ | సాయి ప్రకాశ్ ఉమ్మడిసింగు |
ఎడిటింగ్ | నవీన్ నూలి |
నిర్మాత | సూర్యదేవర నాగ వంశి |
ప్రొడక్షన్ బ్యానర్ | సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ |
సినిమా ఎలా ఉందంటే?
DJ టిల్లు పూర్తి రొమాంటిక్ కామెడీ చిత్రం. డీజే బాయ్స్‌కి ఈ సినిమా చాలా ఇష్టం. స్ట్రాంగ్ తెలంగాణ లాంగ్వేజ్‌లో డైలాగ్స్ ఉన్నాయి. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ లో నేహా శెట్టి ఒకటి. విమల్ కృష్ణ చాలా చక్కగా దర్శకత్వం వహించారు. సంగీతం ఆశించిన స్థాయిలో లేదు.
మూవీ రేటింగ్: 3.5 / 5