Son Of India Movie Review: సన్ ఆఫ్ ఇండియా మూవీ రివ్యూ

Son Of India Movie Review: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సన్ ఆఫ్ ఇండియా మూవీ ఎట్టకేలకు థియేటర్లలో ఈరోజు గ్రాండ్ గా రిలీజ్ అయింది. మంచు ఫ్యామిలీ ప్రెజెంట్ చేసిన ఈ సినిమాకు తొలిరోజే మంచి రెస్పాన్స్ వచ్చింది. కథ, డైలాగ్స్ పక్కనపెడితే మోహన్ బాబు యాక్టింగ్ అద్భుతంగా ఉందంటూ క్రిటిక్స్ రివ్యూస్ ఇస్తున్నారు. ఈ మూవీ రివ్యూకు సంబంధించిన మరిన్ని విషయాలను తెలుసుకుందాం.

Son Of India Movie Review

కథ

ఇక కథ విషయానికి వస్తే.. సన్ ఆఫ్ ఇండియా సినిమా టైటిల్ కు తగ్గట్టే కథ కూడా ఉంటుంది. మెయిన్ లీడ్ రోల్ ప్లే చేసిన మోహన్ బాబు విరుపాక్షపాత్రలో కనిపిస్తాడు. సొసైటీని సరైన దారిలో నడిపించాలని విరుపాక్షకు ఉంటుంది. అందుకు అనేక అడ్డంకులు ఎదురవుతాయి. అన్ని అవాంతరాలను దాటుకుంటూ విరుపాక్ష, రాష్ట్రానికే ముఖ్యమంత్రి అవుతాడు. కథ మొత్తం రాజకీయం, సమాజంలో జరిగే అవినీతి, ఒక సామాన్యుడి ఆవేదన చుట్టే తిరుగుతుంటుంది.

సన్ ఆఫ్ ఇండియా నటీనటులు

డైమండ్ రత్నబాబు ఈ సినిమాకు కథను అందించడంతో పాటు ఆయనే దీనికి దర్శకత్వం వహించారు. మోహన్ బాబు, శ్రీకాంత్, ప్రగ్యా జైస్వాల్ ప్రధాన పాత్రలో నటించారు. తనికెళ్ల భరని, అలి, వెన్నెల కిశోర్, పృథ్వి రాజ్, రఘు బాబు, రాజా రవీంద్ర సపోర్టింగ్ రోల్స్ ప్లే చేశారు. మంచు విష్ణు ఈ మూవీని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు. ఇళయారాజా సంగీతాన్ని సమకూర్చగా, సర్వీశ్ మురారి సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు.

సినిమా పేరుసన్ ఆప్ ఇండియా
నటీనటులుమొహన్ బాబు, శ్రీకాంత్, ప్రగ్యా జైస్వాల్, తనికెళ్ల భరణి, అలి
దర్శకులుడైమండ్ రత్నబాబు
నిర్మాతమంచు విష్ణు
సంగీతంఇళయరాజా
సినిమాటోగ్రఫీసర్వేశ్ మురారి
బ్యానర్24 ఫ్రేం ఫ్యాక్టరీ, శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్

 

సినిమా ఎలా ఉందంటే

ఎక్స్ పెక్టేశన్స్ కు తగ్గట్టుగా సినిమా లేదనే చెప్పాలి. మోహన్ బాబు అనగానే నాన్ స్టాప్ పంచ్ డైలాగ్స్ ను ఊహించుకుంటారు. దర్శకుడు, రచయితలు ఈ సినిమాలో అంత పెద్ద పంచులు ఏమీ చేర్చలేదు. మోహన్ బాబు యక్టింగ్, ప్రగ్యజైస్వాల్ పర్ఫామెన్స్ మాత్రమే ఈ సినిమాకు ప్లస్ అవుతుంది.

మూవీ రేటింగ్: 2.5 / 5

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు