Virgin Story Review: వర్జిన్ స్టోరీ సినిమా ఎట్టకేలకు థియేటర్లలో రిలీజ్ అయింది. వాలెంటైన్స్ డే సందర్భంగా అదే రోజు రిలీజ్ అవుతుందనుకున్నారు గానీ ఈ రోజు అంటే ఫిబ్రవరీ 18న రిలీజ్ అయింది. తొలి చిత్రంతోనే విక్రమ్ సహిదేవ్ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. వకీల్ సాబ్ లో సపోర్టింగ్ రోల్ లో ఆయన యాక్ట్ చేసిన స్టైల్ అందరికీ నచ్చింది. ఊహించినట్టుగానే ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.
వర్జిన్ మూవీ కథ, తారాగణం
కథ విషయానికి వస్తే.. విక్రమ్ సహిదేవ్, సౌమిక పాండియన్ మెయిన్ లీడ్ రోల్స్ ప్లే చేశారు. ఇది కంప్లీట్ గా రొమాంటిక్ కామెడీ ఫిలిం అని చెప్పుకోచ్చు. ఇద్దరూ ఈ సినిమాలో ఒకరిని ఒకరు ఘాడంగా ప్రేమించుకుంటారు గానీ తరువాత విడిపోతారు. ఈ జెనరేషన్లో ప్రేమ ఎలా ఉందనేది ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టు ఉంటుంది. కథ కొత్తగా సాగుతుంది.
ప్రదీప్ బి అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు ఆయనే స్క్రీన్ ప్లే, స్టోరీ రాశారు. సిరిశా లగడపాటి, శ్రీధర్ లగడపాటి కలిసి ఈ మూవీని రామలక్ష్మి సిని క్రియేషన్స్ పై నిర్మించారు. అచ్చు రాజమణి సంగీతాన్ని సమకూర్చగా, అనిష్ థరుణ్ కుమార్ సినిమాటోగ్రఫీని, గ్యారీ బిహెచ్ ఎడిటింగ్ ను హ్యాండిల్ చేశారు.
సినిమా పేరు | వర్జిన్ లవ్ స్టోరి |
నటీనటులు | విక్రమ్ సహిదేవ్, సౌమిక పాండియన్ |
దర్శకులు | ప్రదీప్ బి అట్లూరి |
నిర్మాత | సిరిశ లగడపాటి, శ్రీధర్ లగడపాటి |
సంగీతం | అచ్చు రాజమని |
సినిమాటోగ్రఫీ | అనిష్ తరుణ్ కుమార్ |
బ్యానర్ | రామలక్ష్మి సిని క్రియేషన్స్ |
సినిమా ఎలా ఉందంటే?
ఇప్పటి లేటెస్ట్ ట్రెండ్ కు తగ్గట్లుగా సినిమా ఉంది. రొటీన్ లవ్ స్టోరీ కాకుండా చాలా కొత్తగా డైరెక్టర్ ప్రదీప్ బి అట్లూరి ప్రెజెంట్ చేశారు. ఈ మూవీలో లవ్ తో పాటు కడుపుబ్బా నవ్వించేలా కమెడీ కూడా ఉంది. కొన్ని సన్నివేశాలు కారణంగా మొత్తం సినిమాను కుటుంబంతో కలిసి చూడలేదు. అయితే ఈ వారంలో రిలీజ్ అయిన మంచి సినిమాగా వర్జిన్ స్టోరీని చెప్పుకోవచ్చు.