Neeku Naaku Pellanta Tom Tom Tom Movie Review: సంజన, కార్తీక్, ఖయ్యూమ్ ప్రధాన పాత్రల్లో నటించిన నీకు నాకు పెళ్లంట సినిమా ఎట్టకేలకు ఫిబ్రవరి 18, 2022న థియేటర్లలో విడుదలైంది. బిగ్ బాస్ ఫేమ్ సంజన ప్రధాన పాత్ర పోషించింది. ఇది చిన్న చిత్రంగా అనిపించినప్పటికీ కంటెంట్ చాలా ఆసక్తికరంగా ఉంది, ఇది యువతకు కనెక్ట్ అవుతుంది. వారం తరువాత టాక్ మారొచ్చు. క్రిటిక్స్ ఏమంటున్నారో చూద్దాం.
కథ
బిగ్ బాస్ ఫేం సంజన ఇందులో ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమాలో ఆమెకు చాలా చెడు అలవాట్లు ఉంటాయి. ఒక బాయ్ ఫ్రెండ్ పరిచయం అవుతాడు. అతనితో ప్రేమలో పడుతుంది. తరువాత బ్రేక్ అప్ అవుతుంది. సంజన అలవాట్లను భరించలేక బాయ్ ఫ్రెండ్ వదిలేసి వెళ్లిపోతాడు. ఇంతలోనే ఒక మర్డర్ జరుగుతుంది. కథ మొత్తం అడ్డం తిరుగుతుంది. ఏందా కథ తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే.
నీకు నాకు పెళ్లంట సినిమా తారాగణం
సంజన, కార్తిక్, ఖయ్యుం ప్రధాన పాత్రల్లో నటించారు. తల్లూరి మణికంఠ దర్శకత్వం వహించారు. కాసు శ్రీనివాస్ రెడ్డి దీనిని నిర్మించరు. రఘు కుంచె సంగీతాన్ని సమకూర్చగా, ఆదిత్య వర్ధన్ సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు.
సినిమా పేరు | నీకు నాకు పెళ్లంట |
నటీనటులు | సంజన, కార్తిక్, ఖయ్యుం |
దర్శకులు | తల్లూరి మణికంట |
నిర్మాత | కాసు శ్రీనివాస్ రెడ్డి |
సంగీతం | రఘు కుంచె |
సినిమాటోగ్రఫీ | ఆదిత్య వార్ధన్ |
సినిమా తీర్పు
నీకు నాకు పెళ్లంట ప్రొడక్షన్ వాల్యూస్ పెద్దగా లేవు, కథ బాగున్నా చిన్న బడ్జెట్ సినిమా వల్ల బాగా ప్రెజెంట్ చేయలేకపోయారు. దర్శకుడు రచయిత స్క్రీన్ప్లే మరింత బాగా చేసి ఉంటే బాగుండేదనిపించింది. కానీ ఈ సినిమాను ఒక సారి చూసి ఎంజాయ్ చేయవచ్చు.