GolMaal2020 Movie Review: గోల్‌మాల్ 2020 చిత్రం ఈరోజు ఫిబ్రవరి 18, 2022న విడుదలైంది, విజయ్ శంకర్, మహి మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటించారు, గోల్‌మాల్ 2020 ఒక చిన్న చిత్రం, అయితే నిర్మాతలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి దీనిని బాగా ప్రమోట్ చేసారు, గోల్‌మాల్ 2020కి రివ్యూస్ అన్నీ పాజిటివ్ గానే వస్తున్నాయి. మరియు వారాంతం ముగిసే వరకు ఇది కొనసాగుతుందని మేకర్స్ నమ్ముతున్నారు. మరి ఈ సినిమా ఎలా హిట్ అయిందో చూద్దాం.
కథ
గోల్ మాల్2020 సినిమా మొత్తం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. రఘు ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. అతని ఫ్రెండ్ వయసులో పెద్దగా ఉన్న అమ్మాయితో రిలీషన్ పెట్టుకోవాలనుకుంటాడు. అంతా బాగానే ఉన్నా ఇంతలోోనే రఘు అతని కుటుంబం, ఎమ్మెల్యే కిడ్నాప్ అవుతారు. దీంతో కథ మొత్తం మలుపు తిరుగుతుంది. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
గోల్‌మాల్ 2020 చిత్రం యొక్క తారాగణం & సిబ్బంది
గోల్‌మాల్ 2020 చిత్రానికి జాన్ జెక్కి దర్శకత్వం వహించారు. రామ్, విజయ్ శంకర్, అక్షత సోనావనె ప్రధాన పాత్రలు పోషించారు. కెకెచైతన్య దీన్ని నిర్మించారు. కనిష్క సంగీతాన్ని సమకూర్చగా, జగన్ ఎ సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు.
సినిమా పేరు | గోల్ మాల్ 2020 |
నటీనటులు | రామ్, విజయ్ శంకర్, అక్షత సోనావనె |
దర్శకులు | జాన్ జక్కి |
నిర్మాత | కెకె చైతన్య |
సంగీతం | కనిష్క |
సినిమాటోగ్రఫీ | జగన్ ఎ |
సినిమా ఎలా ఉందంటే?
పేరుకు తగ్గట్టే సినిమాకూడా పూర్తిగా గోల్ మాల్ గా సాగుతుంది. ప్రేక్షకులకు ఏమీ అర్ధం కాకుండా కథ సాగిపోతూ ఉంటుంది. సినిమాలో పెద్ద కామెడీ కూడా ఏమీ లేదు. సినిమా మొత్తం గోల్ మాల్ లో ఉంది. ఎంజాయ్ చేయడానికి పెద్దగా ఏమీ లేదు. మీరు చూడాలనుకుంటే చూడొచ్చు.