Bheemla Nayak Movie Review: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా భీమ్లా నాయక్ సినిమా ఎట్టకేలకు థియేటర్లలలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. పవన్ కళ్యన్ సినిమా కాబట్టి థియేటర్ వద్ద వాతారవరణం, హడావిడి, టికెట్ల బుక్కింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భీమ్లా నాయక్ సినిమా మళయాలంలో వచ్చిన “అయ్యప్పన్ కోషియానం” చిత్రానికి తెలుగు రీమేక్ అన్న విషయం మెజారిటీకి తెలిసిన విషయమే. అయితే ఇందులో పవన్ కళ్యాన్ ఉండడంతో సినిమా అవుట్ పుట్, మ్యూజిక్, డైలాగ్స్ ఒరిజినల్ సినిమా కన్నా బాగా వచ్చింది.
కథ
భీమ్లా నాయక్ సినిమా ఎలా ఉంటుందో తెలుసుకోవానుకున్న వారు ముందుకు మళయాలంలో రిలీజ్ అయిన అయ్యప్పన్ కోషియానం చిత్రాన్ని చూశారు. అందులో ఉన్న మొత్తం కథే ఇందులో ఉంటుంది. ఎస్సై భీమ్లా నాయక్ పాత్రలో పవన్ కళ్యాన్ నటిస్తాడు. ఆర్మ రిటాయర్డ్ హవల్దార్ డాని, డానియల్ శేఖర్ పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తాడు. ఇద్దరి పర్ఫామెన్స్ నువ్వా నేనా అన్నట్లు ఉంటుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో డాని భీమ్లా నాయక్ కు పట్టుబడతాడు. డానీని పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్తారు. అయితే కథ మొత్తం అక్కడి నుంచే మలుపు తిరిగి భీమ్లా నాయక్ పోలీస్ ఉద్యోగం పోయే పరిస్థితి వస్తుంది. అంతిమంగా డాని, భీమ్లా నాయక్ మధ్య జరిగే గడవ, ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.
భీమ్లా నాయక్ తారాగణం
సాగర్ కె చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే రాశారు. పవన్ కళ్యాన్, రానా, నిత్య మీనన్, సమ్యుక్త మీనన్ మెయిన్ లీడ్ రోల్స్ ప్లే చేశారు. సుర్యదేవర నాగ వంశీ ఈ మూవీని 75 కోట్లతో సితార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించారు. ఎస్ తమన్ సంగీతాన్ని సమకూర్చగా, రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలను చేపట్టారు.
సినిమా పేరు | భీమ్లా నాయక్ |
నటీనటులు | పవన్ కళ్యాన్, రానా దగ్గుబాటి, నిత్య మీనన్, సమ్యుక్త మీనన్ |
దర్శకులు | సాగర్ కె చంద్ర |
నిర్మాత | సూర్య దేవర నాగ వంశీ |
సంగీతం | ఎస్. తమన్ |
సినిమాటోగ్రఫీ | రవి కె చంద్రన్ |
బ్యానర్ | సితార ఎంటర్టైన్మెంట్స్ |
సినిమా ఎలా ఉందంటే
మొత్తం సినిమా చాలా అద్భతంగా వచ్చింది. కుటుంబం మొత్తం కలిసి ఒక్క సారి చూడదగ్గ సినిమా. భీమ్లా నాయక్ ఫ్లాష్ బ్యాక్ ను చాలాబాగా తెరకెక్కించారు. మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రానా మరో సారి తన బాహుబలిలో భల్లాలను గుర్తు చేశారు. మళయాలంలో కన్న తెలుగులోనే బాగుందనిపిస్తుంది. రెండు మూడా సార్లు కూడా ఈ సినిమా చూడొచ్చు.