Valimai Movie Review : భారీ అంచనాల నడుమ మొత్తానికి థియేటర్లో రిలీజ్ అయింది యాక్షన్ పవర్ ప్యాక్డ్ మూవీ వాలిమై. తల అజిత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు మంచి టాక్ వినిపిస్తుంది. 2022లో బిగ్గెస్ట్ యాక్షన్ చిత్రంగా నిలిచిపోనుందని క్రిటిక్స్ సైతం పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నరు. వాలిమైలో హాలీవుడ్ నే తలదన్నే స్టైల్ లో యాక్షన్ సీన్స్ ఉన్నాయి. ఈ మూవీ గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం.
కథ
వాలిమై ఒక కంప్లీట్ యాక్షన్ చిత్రం అని చెప్పుకోవచ్చు. హంతకులు, దొంగలుగా మారిన బైక్ రేసర్లను వెంటాడే ఐపీస్ ఆఫీసర్ పాత్రలో తల అజిత్ కనిపిస్తారు. హుమా ఖురేశి హీరోయిన్ గా నటించింది. బైక్ రేసర్ల గ్యాంగ్ లీడర్ గా కార్తికేయ్ గుమ్మకొండ కనిపిస్తాడు. సొసైటీలో బైక్ రేసర్ల దొంగతనాలు, హత్యలు పెరిగిపోతాయి. వీటిని అరికట్టడానికి ఐపీఎస్ అర్జన్ కుమార్ రంగంలోకి దిగుతాడు. తల అజిత్..నిజజీవితంలో మంచి బైక్ రేసర్ కావడంతో ఇందులో అనేక సీన్స్ చాలా బాగా వచ్చాయి.
వాలిమై తారాగణం
హెచ్ వినోద్ ఈ సినిమాకు కథ రాయడంతో పాటు ఆయనే దర్శకత్వం వహించారు. అజిత్ కుమార్, హుమా ఖురేశి, కార్తికేయ గుమ్మకొండ ప్రధాన పాత్రలో నటించారు. బని జె, సుమిత్ర, రాజ్ అయ్యప్ప, చైత్ర రెడ్డి, పుగజ్, యోగి బాబు సపోర్టింగ్ రోల్స్ ప్లే చేశారు.
సినిమా పేరు | వాలిమై |
నటీనటులు | అజిత్ కుమార్; హుమా ఖురేశి, కార్తికేయ గుమ్మకొండ |
దర్శకులు | హెచ్ వినోద్ |
నిర్మాత | బోణి కపూర్ |
సంగీతం | యువన్ శంకర్ రాజా |
సినిమాటోగ్రఫీ | నిరవ్ షా |
బ్యానర్ | బే వ్యూ ప్రాజెక్ట్ ఎల్ఎల్పి |
బోనీ కపూర్ ఈ మూవీని 150 కోట్ల రూపాయలతో బే వ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పీ బ్యానర్ పై నిర్మించారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూర్చగా, నిరవ్ షా సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు. విజయ్ వెల్ కుట్టి ఎడిటింగ్ బాధ్యతలను చేపట్టారు.
సినిమా ఎలా ఉందంటే
హాలీవుడ్ యాక్షన్ చిత్రాలను మరిపించే రేంజ్ లో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో ప్రధానంగా అజిత్ కుమార్ పర్ఫామెన్స్ ఎక్స్ ట్రార్డినరీ అని చెప్పుకోవాలి. ఈ వయసులో కూడా కఠినమైన యాక్షన్ సీన్స్ చేస్తున్నాడే గ్రేటే. బోణీ కపూర్ కూడా 150 కోట్లు ఖర్చుపెట్టడం వల్లే సినిమా ఇంత బాగా వచ్చింది. యువన్ సంగీతం, కార్తికేయ యాక్టింగ్ కూడా ఒక హైలైట్.