Valimai Box Office Collections: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా వాలిమై చిత్రం ఎట్టకేలకు థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఊహించనట్టుగానే ఈ సినిమా తొలిరోజే మంచి టాక్ తో పాటు మంచి కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఫస్ట్ డే ఈ మూవీ సుమారు 40 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పటికే వాలిమై 300 కోట్ల రూపాయల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిందని కూడా అంటున్నారు. వాలిమై మూవీ కలెక్షన్స్ కు సంబంధించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం.
వాలిమై బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డై వైజ్ (Valimai Box Office Collections World Wide Day Wise)
రోజులు | కలెక్షన్స్ |
డే 1 | 40.3 కోట్లు |
డే 2 | |
డే 3 | |
డే 4 | |
డే 5 | |
డే 6 | |
డే 7 | |
మొత్తం కలెక్షన్స్ | 40.3 కోట్లు |
వాలిమై నటీనటులు
హెచ్ వినోద్ ఈ సినిమాను రచించడంతో పాటు ఆయనే దీనికి దర్శకత్వం వహించారు. బోణీ కపూర్ 150 కోట్ల రూపాయలతో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై దీన్ని నిర్మించారు. తల అజిత్ కుమార్, హుమా ఖురేషి, కార్తికేయ గుమ్మకొండ ప్రధాన పాత్రలో నటించారు.
సినిమా పేరు | వాలిమై |
నటీనటులు | అజిత్ కుమార్; హుమా ఖురేశి, కార్తికేయ గుమ్మకొండ |
దర్శకులు | హెచ్ వినోద్ |
నిర్మాత | బోణి కపూర్ |
సంగీతం | యువన్ శంకర్ రాజా |
సినిమాటోగ్రఫీ | నిరవ్ షా |
బ్యానర్ | బే వ్యూ ప్రాజెక్ట్ ఎల్ఎల్పి |
బణి జె, సుమిత్ర, రాజ్ అయ్యప్ప, చైత్ర రెడ్డి, పుగజి, యోగి బాబు, ద్రువన్ సపోర్టింగ్ రోల్స్ ప్లే చేశారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూర్చగా, నిరవ్ షా సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు. విజయ్ వెలుకుట్టి ఎడిటింగ్ బాధ్యతలను చేపట్టారు.
వాలిమై ప్రీ రిలీజ్ బిజినెస్
వాలిమై చిత్రం విడుదలకు ముందే 300 కోట్ల ప్రీ రిలీజ్ చేసిందని టాక్ వినిపిస్తుంది. 150 కోట్లతో నిర్మించిన ఈ సినిమాకు రిలీజ్ కాకముందే 100 శాతం లాభం వచ్చిందని టాక్ టౌన్ కోడైకూస్తుంది. వాలిమై పాన్ ఇండియా సినిమా కావడం, తెలుగు, తమిళ్, మళయాలం, హిందీ, కన్నడ భాషల్లో ఒకే సారి రిలీజ్ అవడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ గట్టిగానే అయ్యిందని అంటున్నారు.
డిస్క్లైమర్: పైన మేము ఇచ్చిన వివరాలన్నీ కేవలం అవగాహన కోసమే ఇచ్చాము గానీ ఇవే సత్యం నిజం వాస్తవం అని మేము చెప్పడం లేదు. పైన ఇచ్చిన నంబర్లు పరిస్థితిని మార్కెట్ ను బట్టి మారవచ్చు. ఈ ఆర్టికల్ లోని వివరాలకు మేము ఖచ్చితత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వము.